BCCI Review Meeting: బీసీసీఐ నూతన సంవత్సరం రోజున (జనవరి 1, 2023) సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో క్రీడాకారుల పనిభారం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ, ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో అక్టోబర్‌లో జరగనున్న ప్రపంచకప్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, కొంతమంది కీలక ఆటగాళ్లకు ఐపీఎల్ 2023 నుంచి విశ్రాంతి తీసుకోవచ్చని తెలుస్తోంది.
ఈ సమావేశంలో వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌తో పాటు, 2022 టీ20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్, ఆఫ్రికా, ఇంగ్లండ్‌లతో ఓడిపోయిన సిరీస్‌లపై కూడా చర్చించారు. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడాడు. ఆటగాళ్లు పదే పదే ఎందుకు గాయపడుతున్నారో తేల్చాలని అన్నారు. గతేడాది జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చాహర్ వంటి బౌలర్లు ఎక్కువగా గాయపడ్డారు.
ఆటగాళ్ల ఫిట్‌నెస్ గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ, “మేం దాని దిగువకు వెళ్లి తెలుసుకోవడానికి మా వంతు ప్రయత్నం చేయాలి. అది ఏమిటో నాకు తెలియదు. వారు చాలా క్రికెట్ ఆడుతున్నారు అని కావచ్చు. ఆ ఆటగాళ్లందరిపైనా ఓ కన్నేసి ఉంచాలి. ఎందుకంటే వారు భారత్‌కు ఆడుతున్నప్పుడు పూర్తిగా ఫిట్‌గా ఉండాలని అర్థం చేసుకోవాలి’ అని చెప్పుకొచ్చాడు.
• ప్లేయర్స్ గాయం కారణంగా IPL 2023 నుంచి తొలగించే ఛాన్స్.
• వన్డే ప్రపంచ జట్టు 20 మంది ఆటగాళ్ల పూల్ నుంచి ఎంపిక చేయనున్నారు.
• కొత్త బ్లూప్రింట్ ప్రకారం, సెంట్రల్ పూల్ ఆఫ్ ప్లేయర్స్ కోసం ఫిట్‌నెస్, వర్క్‌లోడ్ రోడ్‌మ్యాప్ తయారు చేస్తారు. ఇందుకోసం ఇప్పటికే కార్యచరణ ప్రారంభమయ్యాయి.
• ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టడానికి యో-యో టెస్ట్ అలాగే డెక్సా స్కాన్ జోడించారు. ఈ టెస్టు ద్వారా ఆటగాళ్ల ఎముకల పటిష్టత తెలిసిపోతుంది.
• డెక్స్ పరీక్ష క్రీడాకారుల శరీర కొవ్వు, ఎముకలు, కండరాల బలాన్ని నిర్ధారిస్తుంది. డెక్సా 10 నిమిషాల పరీక్ష.
• జట్టులో ఎంపికకు IPL మాత్రమే ప్రమాణం కాదు. జట్టులో చోటు దక్కించుకోవాలంటే దేశవాళీ క్రికెట్‌లో ఆటగాళ్లు ఎక్కువగా ఆడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..