ఆసియా కప్ 2022 (Asia Cup 2022) టోర్నీకి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఆగస్టు 28న భారత్ వర్సెస్ పాకిస్థాన్‌ల మధ్య (IND vs PAK 2022) మ్యాచ్ జరగనుంది. అయితే అంతకంటే ముందు టీమ్ ఇండియా ఆటగాళ్లు ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకోవలసి ఉంటుంది. వాస్తవానికి ఆగస్టు 20న జాతీయ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ ఈ ఫిట్‌నెస్ క్యాంపును నిర్వహించింది. అదే సమయంలో భారత జట్టు ఆగస్టు 23 న దుబాయ్‌కు బయలుదేరనుంది.
ఆగస్ట్ 23న దుబాయ్ బయల్దేరనున్న టీమిండియా..
కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఆగస్టు 20న నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాల్గొననుంది. అదే సమయంలో ఆగస్టు 23న టీమ్ ఇండియా దుబాయ్ వెళ్లనుంది. ఆసియా కప్ 2022లో భారత జట్టు ఆగస్టు 28న తొలి మ్యాచ్ ఆడనుంది. భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. దీంతో పాటు దీపక్ హుడా, అవేశ్ ఖాన్ వంటి ఆటగాళ్లు జింబాబ్వే పర్యటనలో ఉన్నారు.
ఆసియా కప్ కోసం భారత జట్టు-
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (కీపర్), దినేష్ కార్తీక్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్