Video: హ్యాండ్ షేక్ వివాదం.. టీమిండియా ఆటగాళ్ల ఘోర తప్పిదం.. పిలిచి మరీ క్లాస్ పీకిన గంభీర్..

Asia Cup 2025 IND vs PAK: ఆసియా కప్ టోర్నమెంట్ తొలి రౌండ్‌లో పాకిస్థాన్‌పై టీమిండియా భారీ విజయం సాధించింది. దుబాయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 20 ఓవర్లలో 129 పరుగులు మాత్రమే చేసింది. ఈ లక్ష్యాన్ని టీమ్ ఇండియా 15.5 ఓవర్లలోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు, రెండో మ్యాచ్‌లో కూడా భారత జట్టు 6 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

Video: హ్యాండ్ షేక్ వివాదం.. టీమిండియా ఆటగాళ్ల ఘోర తప్పిదం.. పిలిచి మరీ క్లాస్ పీకిన గంభీర్..
Gautam Gambhir Urged

Updated on: Sep 23, 2025 | 7:30 AM

Asia Cup 2025 IND vs PAK: భారత్, పాకిస్తాన్ మధ్య కరచాలన వివాదం కొనసాగుతోంది. సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ తర్వాత, టీం ఇండియా ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించారు. భారత ఆటగాళ్ల ఈ చర్యపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా, టోర్నమెంట్ నుంచి వైదొలుగుతామని కూడా బెదిరించింది.

అయితే, టీం ఇండియా ఆటగాళ్లు తమ వైఖరిని మార్చుకోలేదు. సెప్టెంబర్ 21న దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన 2వ మ్యాచ్‌లో కూడా భారత ఆటగాళ్లు కరచాలనం చేయలేదు. మ్యాచ్ ముగియగానే, టీం ఇండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లారు.

ఇవి కూడా చదవండి

కానీ, ఈసారి డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిన టీం ఇండియా ఆటగాళ్లను కోచ్ గౌతమ్ గంభీర్ తిరిగి పిలిపించాడు. పాక్ ఆటగాళ్లను పట్టించుకోని భారత ఆటగాళ్లు అంపైర్లతో కరచాలనం చేయడం మర్చిపోయారు.

భారత జట్టు ఆటగాళ్లు ఈ మర్యాద పాటించాలని గౌతమ్ గంభీర్ ఆదేశించారు. దీని ప్రకారం, భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ నుంచి తిరిగి వచ్చి అంపైర్లతో కరచాలనం చేశారు. తాజాగా, గౌతమ్ గంభీర్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి అంపైర్లతో కరచాలనం చేయమని అడుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

గౌతమ్ గంభీర్ హ్యాండ్ షేక్ సూచించిన వీడియో:

పాకిస్థాన్‌పై భారీ విజయం..

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీని ప్రకారం, ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టుకు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లు అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత, శుభ్‌మన్ గిల్ (47) అవుట్ అయ్యాడు.

అయితే, మరోవైపు, అభిషేక్ శర్మ 39 బంతుల్లో 5 సిక్సర్లు, 6 ఫోర్లతో 74 పరుగులు సాధించి మెరుపులు మెరిపించాడు. ఈ విస్ఫోటక అర్ధ సెంచరీ సహాయంతో, టీం ఇండియా 18.5 ఓవర్లలో 174 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్ : సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఫఖర్ జమాన్, మహ్మద్ హారిస్ ( వికెట్ కీపర్ ), సల్మాన్ అలీ అఘా ( కెప్టెన్ ), మహ్మద్ నవాజ్, హుస్సేన్ తలత్, షాహీన్ షా ఆఫ్రిది, ఫహీమ్ అష్రఫ్, హరీ అహ్మద్.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..