Rohit Sharma: టీ20ల్లో సరికొత్త చరిత్ర లిఖించనున్న హిట్‌మ్యాన్.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డ్..

Updated on: Jan 14, 2024 | 12:15 PM

Rohit Sharma Records: టీమిండియా తరపున 149 టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ ఇప్పటివరకు 3853 పరుగులు చేశాడు. 20 వికెట్లు కూడా తీశాడు. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచంలో రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అయితే, నేడు ఆఫ్ఘాన్‌తో రెండో టీ20 మ్యాచ్ ఆడడం ద్వారా మరో సరికొత్త రికార్డ్ లిఖించే దిశగా దూసుకపోతున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 5
ఇండోర్ వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ మధ్య జరగనున్న టీ20 మ్యాచ్ ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్రను లిఖించనున్నాడు. అది కూడా టీ20 క్రికెట్ చరిత్రలో ఎవరూ చేయని ప్రత్యేక ఫీట్ కావడం గమనార్హం.

2 / 5
టీ20 క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆటగాడు 150 మ్యాచ్‌లు ఆడలేదు. ఇప్పటి వరకు 149 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ.. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే 2వ టీ20 మ్యాచ్ ద్వారా 150 మ్యాచ్‌లు ఆడిన ఫీట్‌ను పూర్తి చేయనున్నాడు.

3 / 5
ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పనున్నాడు. అలాగే, ఈ జాబితాలో 2వ స్థానం ఐరిష్ ఆటగాడు. ఐర్లాండ్‌కు చెందిన పాల్ స్టిర్లింగ్ మొత్తం 134 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో స్టిర్లింగ్ 3438 పరుగులు, 20 వికెట్లు తీయడంలో విజయం సాధించాడు.

4 / 5
150వ మ్యాచ్‌లో దూసుకెళ్తున్న రోహిత్ శర్మ ఇప్పటివరకు 3853 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్‌లో 20 వికెట్లు కూడా తీశాడు. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచంలో రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

5 / 5
టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. మొత్తం 115 టీ20 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లీ 4008 పరుగులు చేశాడు. దీని ద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో 4000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కింగ్ కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించాడు.