IND vs SA Final: ఫైనల్ కోసం ఆటను దాచి పెట్టాడు.. కోహ్లీకి మద్దతుగా రోహిత్ కీలక వ్యాఖ్యలు..

T20 World Cup 2024: ఈ ప్రపంచకప్‌లో టీమిండియాకు ఓపెనర్‌గా ఆడుతున్న విరాట్ కోహ్లీ 7 ఇన్నింగ్స్‌ల్లో 75 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లి ఓపెనర్‌గా ఆడుతుండగా, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ బెంచ్‌పైనే ఉన్నాడు. అయితే, విరాట్ కోహ్లీ ఆటకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మద్దతు పలికాడు.

IND vs SA Final: ఫైనల్ కోసం ఆటను దాచి పెట్టాడు.. కోహ్లీకి మద్దతుగా రోహిత్ కీలక వ్యాఖ్యలు..
Rohit Sharma Virat Kohli 1
Follow us

|

Updated on: Jun 28, 2024 | 10:49 AM

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌లో 2వ సెమీ ఫైనల్‌లో టీమిండియా విజయం సాధించింది. గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ (57) టీమిండియా తరుపున హాఫ్ సెంచరీ చేయగా, సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులతో రాణించాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.

172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ చేయడంతో టీమిండియా 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.

ఈ విజయం తర్వాత టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. భారత జట్టు ప్రదర్శనపై ప్రశంసలు కురిపించాడు. నిర్ణయాత్మక మ్యాచ్‌లో విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. మా విజయానికి టీమ్ ఎఫర్టే ప్రధాన కారణం. ఇక్కడ అందరూ బాగా సహకరించారు. మేం పరిస్థితులకు బాగా అలవాటు పడ్డామని నేను భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

ఎందుకంటే, ఈ పిచ్ కాస్త ఛాలెంజింగ్‌గా ఉంది. ఇక్కడ అడాప్ట్ చేసుకోవడం కాస్త కష్టమైంది. పరిస్థితికి అనుగుణంగా ఆడాం. బౌలర్లు, బ్యాట్స్‌మెన్ పరిస్థితులకు అనుగుణంగా ఆడితే ఫలితం మనకు అనుకూలంగా ఉంటుందని రోహిత్ శర్మ అన్నాడు.

ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం కష్టమని, ఒక దశలో 140-150 పరుగులు చేస్తే సరిపోతుందని భావించామని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. నాకు, సూర్యకి బాగా కలిసొచ్చింది. అయితే, ఆ తర్వాత మరిన్ని పరుగులు రావాలని భావించాను.

దీని గురించి నేను ఎవరికీ తెలియజేయలేదు. ఎందుకంటే, ప్రతి ఒక్కరూ తమ ఆటను ఆడుకుంటారు. కాబట్టి, వాళ్లంతా స్వేచ్ఛగా ఆడాలని కోరుకుంటున్నాను. అయితే, 150 పరుగుల మార్కును దాటాలని నా మనసులో అనుకున్నాను.

కాబట్టి, మేం 170 పరుగులు చేసినప్పుడు, ఈ పిచ్‌పై ఇది మంచి స్కోర్ అని నేను అనుకున్నాను. ఆ తర్వాత మన బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ చేశారు. ఈ విజయంలో ఘనత మన స్పిన్నర్లకే దక్కుతుందని రోహిత్ శర్మ అన్నాడు.

విరాట్ కోహ్లి క్లాస్ ప్లేయర్..

ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన గురించి అడిగిన ప్రశ్నకు, రోహిత్ శర్మ అతను (కోహ్లీ) నాణ్యమైన ఆటగాడు అంటూ చెప్పుకొచ్చాడు. కోహ్లీకి ఫామ్ ఎప్పుడూ సమస్య కాదు. 15 సంవత్సరాలుగా క్రికెట్ ఆడుతున్నప్పుడు, ఫామ్ ఎప్పుడూ సమస్య కాదు.

బహుశా విరాట్ కోహ్లి తన ఆటను ఫైనల్‌కు కాపాడుకుంటున్నాడని నేను అనుమానిస్తున్నాను. కాబట్టి, ఫైనల్ బాగా ఆడతాడన్న నమ్మకం ఉంది. దీని గురించి మాకు ఎలాంటి ఆందోళన లేదని రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి మద్దతుగా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..
నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..