Mohammad Shami: ‘ఈరోజు మాది కాదు.. సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు.. కచ్చితంగా తిరిగి వస్తాం’: షమీ ఎమోషనల్ ట్వీట్..

PM Modi Meets Indian Players: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 240 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. ఈ టోర్నీలో భారత జట్టు వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది. అయితే, ఫైనల్ మ్యాచ్‌లో తడబడింది. అయితే, జట్టు ఆటతీరును మెచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియానికి రావడమే కాకుండా.. మ్యాచ్ ముగిసిన అనంతరం టీమ్ ఇండియా ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.

Mohammad Shami: ఈరోజు మాది కాదు.. సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు.. కచ్చితంగా తిరిగి వస్తాం: షమీ ఎమోషనల్ ట్వీట్..
Shami With Pm Modi

Updated on: Nov 20, 2023 | 4:37 PM

ICC World Cup 2023: ప్రపంచ కప్ 2023 (ICC World Cup 2023) ఫైనల్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి 6వ సారి వన్డే ప్రపంచ కప్ ఛాంపియన్ టైటిల్‌ను గెలుచుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 240 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది. ఈ టోర్నీలో భారత జట్టు వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచింది. అయితే, ఫైనల్ మ్యాచ్‌లో తడబడింది. అయితే, జట్టు ఆటతీరును మెచ్చుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియానికి రావడమే కాకుండా.. మ్యాచ్ ముగిసిన అనంతరం టీమ్ ఇండియా ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.

క్రీడాకారులతో సమావేశమైన ప్రధాని మోదీ..

ఫైనల్ మ్యాచ్ తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ భారత ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌ను సందర్శించారు. గుజరాత్‌కు చెందిన స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాతో సహా జట్టులోని ఇతర ఆటగాళ్లను కలిశారు. టోర్నీలో జట్టు ప్రదర్శనను కూడా ప్రశంసించాడు.

షమీ ఎమోషన్ ట్వీట్..

ప్రధాని మోదీని కలిసిన తర్వాత టీమిండియా ఆటగాడు ఫాస్ట్ బౌలర్ షమీ.. ఎక్స్‌లో ఎమోషనల్ ట్వీట్ షేర్ చేశాడు.
‘దురదృష్టవశాత్తు నిన్న మా రోజు కాదు. టోర్నీ అంతటా మా జట్టుకు, నాకు మద్దతుగా నిలిచినందుకు భారతీయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా పీఎం నరేంద్రమోదీ కి ధన్యవాదాలు. డ్రెస్సింగ్ రూమ్‌కి రావడమే కాదు.. ఆయన మాటలతో మాలో స్ఫూర్తిని పెంచారు. మేం తప్పకుండా తిరిగివస్తాం’ అంటూ రాసుకొచ్చాడు.

ట్వీట్ చేసిన ప్రధాని మోదీ..

ఆటగాళ్లతో సమావేశమైన తర్వాత ప్రధాని మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.’ డియర్ టీమిండియా.. ఈ ప్రపంచకప్‌లో మీ ప్రతిభ, సంకల్పం విశేషం. మీరు గొప్ప అభిరుచితో ఆడారు. దేశానికి అపారమైన గర్వాన్ని తెచ్చారు. మేం ఈ రోజే కాదు.. ఎల్లప్పుడూ మీతోనే ఉంటాం” అంటూ ట్వీట్ చేశారు.

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..