IND vs NZ 1st Test: ప్రమాదంలో భజ్జీ రికార్డు.. అశ్విన్ ముందు అద్భుత అవకాశం.. ధోనీని అధిగమించేందుకు రహానె‌కు ఛాన్స్..!

|

Nov 25, 2021 | 10:57 AM

వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (417) భారత్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. అయితే అతని రికార్డును..

IND vs NZ 1st Test: ప్రమాదంలో భజ్జీ రికార్డు.. అశ్విన్ ముందు అద్భుత అవకాశం.. ధోనీని అధిగమించేందుకు రహానె‌కు ఛాన్స్..!
India Vs New Zealand, 1st Test, Ashwin Vs Haribhajan
Follow us on

IND vs NZ 1st Test: రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం నుంచి కాన్పూర్ వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. టీ20 సిరీస్‌లో కివీస్‌పై క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా టెస్టు సిరీస్‌‌లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాంటి భారీ రికార్డులు నెలకొల్పగలదో చూద్దాం.

కాన్పూర్‌లో భజ్జీ రికార్డు బద్దలయ్యేనా..
వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (417) భారత్ తరఫున అత్యధిక టెస్టు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. అయితే అతని రికార్డును మొదటి టెస్టులో బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. నిజానికి కాన్పూర్ టెస్టులో అశ్విన్ 5 వికెట్లు తీస్తే హర్భజన్ (417)ను అధిగమించే ఛాన్స్ ఉంది. హర్భజన్ సింగ్ 103 టెస్టుల్లో 417 మంది బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ చేర్చాడు. అశ్విన్ 79 మ్యాచుల్లో 413 వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ 9 వికెట్లు పడగొడితే టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ప్రపంచంలో 11వ బౌలర్‌గా అశ్విన్‌కి పెద్ద అవకాశం ఉంది. పాకిస్థాన్‌కు చెందిన వసీం అక్రమ్ (414), భారత ఆటగాడు హర్భజన్ సింగ్ (417), దక్షిణాఫ్రికాకు చెందిన షాన్ పొలాక్ (421) కలిసి ముగ్గురు దిగ్గజాలను వెనక్కు నెట్టనున్నాడు.

ధోనీ రికార్డు కూడా ప్రమాదంలోనే..
ఈ మ్యాచ్‌లో తాత్కాలిక కెప్టెన్ అజింక్యా రహానె కూడా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని అధిగమించే అవకాశం ఉంది. భారత్ తరఫున ధోనీ 90 టెస్టుల్లో 4876 పరుగులు చేయగా, రహానే 78 మ్యాచ్‌ల్లో 4756 పరుగులు చేశాడు. కాన్పూర్‌లో అజింక్యా 120 పరుగులు చేయగలిగితే, అతను ధోనిని అధిగమించి భారత్ తరఫున అత్యధిక టెస్టు పరుగులు చేసిన 13వ ఆటగాడిగా నిలవనున్నాడు.

50 వికెట్లకు చేరువలో సౌతీ..
కివీస్ బౌలర్ టిమ్ సౌతీ భారత్‌తో జరిగిన 9 టెస్టు మ్యాచ్‌లలో 44 వికెట్లు పడగొట్టాడు. కాన్పూర్‌లో సౌదీ 6 వికెట్లు తీస్తే.. భారత్-న్యూజిలాండ్ మధ్య టెస్టు క్రికెట్‌లో 50 వికెట్లు తీసిన ఆరో బౌలర్‌గా నిలిచాడు. అతని కంటే ముందు రిచర్డ్ హ్యాడ్లీ (65), బిషన్ సింగ్ బేడి (57), ఎరపల్లి ప్రసన్న (55), ఆర్. అశ్విన్ (52), అనిల్ కుంబ్లే (50) సౌతీ కంటే ముందు ఉన్నారు.

Also Read: IND vs NZ 1st Test, Day 1 LIVE Score: తొలి వికెట్ కోల్పోయిన భారత్.. మయాంక్ అగర్వాల్ (13) ఔట్

IND vs NZ, 1st Test: టాస్ గెలిచిన టీమిండియా.. తొలి టెస్ట్ ఆడనున్న శ్రేయాస్ అయ్యర్.. యంగ్ ప్లేయర్లకు సువర్ణావకాశం..!