Asia Cup 2023: పాకిస్థాన్‌పై టీమిండియా అత్యుత్తమ ప్లేయింగ్ XI ఇదే.. లక్కీ ఛాన్స్ ఎవరికంటే?

|

Aug 29, 2023 | 1:55 PM

India Playing XI vs Pakistan: ఆసియా కప్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబరు 2న క్యాండీలో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. తాజాగా శ్రీలంక గడ్డపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవడం పాకిస్థాన్‌కు ప్లస్ పాయింట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌ గెలవాలంటే బ్యాలెన్స్‌డ్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌తో మైదానంలోకి దిగాల్సి ఉంటుంది.

Asia Cup 2023: పాకిస్థాన్‌పై టీమిండియా అత్యుత్తమ ప్లేయింగ్ XI ఇదే.. లక్కీ ఛాన్స్ ఎవరికంటే?
Ind Vs Pak Match
Follow us on

ఆసియా కప్ కోసం టీమ్ ఇండియా శిక్షణ దాదాపు పూర్తయింది. ఆసియా కింగ్ కావడానికి సిద్ధమైంది. అన్ని సన్నాహాల తర్వాత ప్రస్తుతం చర్చంతా ప్లేయింగ్ ఎలెవెన్‌పై నిలిచింది. బరిలోకి దిగే 11 మందిపై బ్యాలెన్స్ కలిగి ఉండటం అవసరం. ఆసియా కప్‌లో భారత్ తొలి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరగనుంది. ఈ మ్యాచ్ క్యాండీలో జరగనుంది. పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం ఫామ్‌లోనే ఉంది. అసలు విషయం ఏంటంటే పాక్ ఆటగాళ్లకు శ్రీలంక పరిస్థితులు, వాతావరణం బాగా అలవాటైంది. ఆసియా కప్‌నకు ముందే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను గెలుచుకుని నంబర్ వన్ వన్డే జట్టుగా అవతరించింది. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌ను ఓడించలేమని అర్థం కాదు. కానీ, విజయం కోసం బాగా కష్టపడాలన్నమాట.

కెప్టెన్ రోహిత్ శర్మ తన 11 మంది ఆటగాళ్లను సక్రమంగా ఎంపిక చేస్తే పాకిస్థాన్‌ను ఓడించవచ్చు. తొలి మ్యాచ్‌లో పాక్‌ను ఓడించడం ద్వారా టీమిండియా బలం పెరుగుతుంది. ఇది రాబోయే మ్యాచ్‌లను గెలవడానికి ఉపయోగపడుతుంది. అయితే ఆ 11 మంది ఆటగాళ్లు ఎవరనేది పెద్ద ప్రశ్నగా మారింది. పాకిస్థాన్‌పై భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌కి ఏ ఆటగాళ్లకు ఛాన్స్ వస్తుంది? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి

వీరు టాప్ ఫోర్ బ్యాట్స్‌మెన్ కావచ్చు..

బెంగళూరులోని క్యాంప్ నుంచి వచ్చిన సమాచారం చూస్తుంటే, కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ బాధ్యతను తన భుజస్కంధాలపై ఉంచుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. గిల్ జట్టుకు రెండవ ఓపెనర్ కావొచ్చు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ దిగవచ్చు. శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో ఆడటం కూడా దాదాపు ఖాయం.

మిడిలార్డర్‌లో రాహుల్ లేదా ఇషాన్, హార్దిక్ ఆడటం ఖాయం!

టాప్ 4 బ్యాట్స్‌మెన్ తర్వాత 5వ స్థానంలో ఫిట్‌గా ఉంటే, అప్పుడు కేఎల్ రాహుల్ ఆడటం చూడొచ్చు. అతను ఫిట్‌గా లేకుంటే, బహుశా ఇషాన్ కిషన్ ఆ స్థానంలో ఆడటం చూడొచ్చు. ఆరో స్థానంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నిలిచాడు.

ఈ బౌలర్లకు చోటు దక్కొచ్చు..

బౌలింగ్ గురించి మాట్లాడితే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ కమాండ్‌ను నిర్వహిస్తారు. అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు తీసుకోవచ్చు. కాబట్టి ఓవరాల్‌గా ఇదే జట్టు పాకిస్థాన్‌పై ఆడటం చూడొచ్చు.

పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్/ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..