IND vs NZ: పూణెలో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ మాస్టర్.. ఆసీస్ ప్లేయర్‌కు ఇచ్చిపడేశాడుగా

|

Oct 24, 2024 | 12:56 PM

India vs New Zealand, 2nd Test: పూణె వేదికగా భారత్‌తో జరుగుతున్న 2వ టెస్టులో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ లంచ్ విరామ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది.

IND vs NZ: పూణెలో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ మాస్టర్.. ఆసీస్ ప్లేయర్‌కు ఇచ్చిపడేశాడుగా
R Ashwin Records
Follow us on

India vs New Zealand, 2nd Test: టెస్టు క్రికెట్‌లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త చరిత్రను లిఖించాడు. పుణెలో న్యూజిలాండ్‌తో జరుగుతోన్న 2వ టెస్టు మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ జాబితాలో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 78 ఇన్నింగ్స్‌ల్లో 1809.2 ఓవర్లు బౌలింగ్ చేసిన లియాన్ మొత్తం 187 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు అశ్విన్‌ ఆసీస్ ప్లేయర్‌ లియాన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టెస్ట్ సిరీస్‌లో మొత్తం 74 ఇన్నింగ్స్‌లు ఆడిన అశ్విన్ 1390* ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈసారి మొత్తం 188* వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో డబ్ల్యూటీసీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

ఈ వార్తను కూడా చదవండి: IPL History: తొలి ఓవర్ తొలి బంతికే వికెట్.. ఐపీఎల్‌లో డేంజరస్ బౌలర్లు.. లిస్ట్‌‌లో ఐదుగురు మనోళ్లే

ప్రస్తుతం 188 వికెట్లతో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ 200 వికెట్లు చేరుకోవడానికి ఇంకా 12 వికెట్లు కావాల్సి ఉంది. ఇప్పుడు న్యూజిలాండ్‌తో 2వ టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఆ తర్వాత మూడో టెస్టు మ్యాచ్ ముంబైలో జరగనుంది. మరి ఈ మ్యాచ్‌ల ద్వారా అశ్విన్ రెండు వందల వికెట్ల మార్కును దాటతాడో లేదో చూడాలి.

టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ ఏడో స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 104* టెస్టు మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 4453 ఓవర్లలో మొత్తం 530* వికెట్లు తీశాడు. అలాగే, అనిల్ కుంబ్లే (619) తర్వాత టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు.

ఈ వార్తను కూడా చదవండి: IPL 2025: ఢిల్లీకి షాకిచ్చిన పంత్.. మెగా వేలంలోకి ఎంట్రీ.. పోటీకి సిద్ధమైన మూడు జట్లు?

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా.

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టామ్ లాథమ్(సి), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(w), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..