కెరీర్‌లో ఒక్క వన్డే ఆడలేదు.. పైగా కోహ్లీ ఫ్రెండ్.. కట్ చేస్తే.. ప్రపంచకప్ విన్నర్‌గా రిటైర్మెంట్..

కెరీర్‌లో ఒక్క అంతర్జాతీయ వన్డే, టెస్ట్.. కనీసం టీ20 క్రికెట్ కూడా ఆడలేదు ఈ భారత క్రికెటర్. కానీ మన కింగ్ కోహ్లీతో కలిసి ప్రపంచకప్ గెలిచాడు. అదేనండీ.! ఈ క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి టీమిండియాకు అండర్-19 వరల్డ్‌కప్ అందించాడు. ఇప్పుడు ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ పలికాడు.

కెరీర్‌లో ఒక్క వన్డే ఆడలేదు.. పైగా కోహ్లీ ఫ్రెండ్.. కట్ చేస్తే.. ప్రపంచకప్ విన్నర్‌గా రిటైర్మెంట్..
Virat Kohli Friend

Updated on: Feb 21, 2024 | 10:11 AM

కెరీర్‌లో ఒక్క అంతర్జాతీయ వన్డే, టెస్ట్.. కనీసం టీ20 క్రికెట్ కూడా ఆడలేదు ఈ భారత క్రికెటర్. కానీ మన కింగ్ కోహ్లీతో కలిసి ప్రపంచకప్ గెలిచాడు. అదేనండీ.! ఈ క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి టీమిండియాకు అండర్-19 వరల్డ్‌కప్ అందించాడు. ఇప్పుడు ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ పలికాడు. మరి అతడెవరో కాదు.. 35 ఏళ్ల తరువర్ కోహ్లీ. డొమెస్టిక్ క్రికెట్‌లో కోహ్లీ ఆల్‌రౌండర్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్.. తన పదునైన పేస్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.

పంజాబ్‌లో జన్మించిన తరువర్ కోహ్లీ.. దేశవాళీ క్రికెట్‌లో మొత్తంగా 184 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 55 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 72 లిస్ట్-A, 57 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మూడు ఫార్మాట్‌లలోనూ కలిపి తరువర్ కోహ్లీ బ్యాట్‌తో 7543 పరుగులు చేశాడు. అలాగే బంతితో 133 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మిజోరం మాజీ కెప్టెన్‌గా తరువర్ కోహ్లీ 307 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో, కోహ్లీ పేరిట14 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే అతడు 53.80 సగటుతో 4573 పరుగులు చేశాడు. అటు బౌలింగ్‌లో 74 వికెట్లు తీశాడు.

2008లో కోహ్లీతో కలిసి అండర్‌-19 ప్రపంచకప్‌..

2008లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో తరువర్ కోహ్లీ కీలక సభ్యుడు. అతడు ఆ టోర్నమెంట్‌లోని 6 మ్యాచ్‌ల్లో 3 అర్ధ సెంచరీలతో 218 పరుగులు చేశాడు. టోర్నీలో మూడో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2008లో తరువర్ దేశవాళీ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అతడు పంజాబ్ తరపున సౌరాష్ట్రతో రాజ్‌కోట్‌లో తన మొదటి మ్యాచ్ ఆడాడు. ఇక గత ఏడాది జనవరిలో అరుణాచల్ ప్రదేశ్‌తో మిజోరం తరఫున చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌‌కి ప్రాతినిధ్యం వహించాడు. 2009లో లిస్ట్‌-ఏలో తొలి మ్యాచ్‌.. 2022లో చివరి మ్యాచ్‌ ఆడాడు.