ఆ ప్లేయర్‌ని ఈసారికి విడిచిపెట్టండి.. తమిళనాడు క్రికెట్ సంఘాన్ని కోరిన బీసీసీఐ.. ఎందుకో తెలుసా..

|

Feb 11, 2021 | 7:22 PM

ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన టీం ఇండియా ప్లేయర్ టి.నటరాజన్‌‌ను విడిచిపెట్టాలని బీసీసీఐ తమిళనాడు క్రికెట్‌ సంఘాన్ని

ఆ ప్లేయర్‌ని ఈసారికి విడిచిపెట్టండి.. తమిళనాడు క్రికెట్ సంఘాన్ని కోరిన బీసీసీఐ.. ఎందుకో తెలుసా..
నటరాజన్
Follow us on

ఆస్ట్రేలియా పర్యటనలో అదరగొట్టిన టీం ఇండియా ప్లేయర్ టి.నటరాజన్‌‌ను విడిచిపెట్టాలని బీసీసీఐ తమిళనాడు క్రికెట్‌ సంఘాన్ని (టీఎన్‌సీఏ) కోరింది. మరికొద్ది రోజుల్లో దేశవాళీ క్రికెట్‌లో భాగంగా విజయ్‌ హజారే వన్డే ట్రోఫీ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇందులో నటరాజన్ కీలక రోల్ పోషించనున్నాడు. అయితే ఇంగ్లాండ్‌తో జరిగే టీ ట్వంటీ సిరీస్‌కు నటరాజన్‌ను ఆడించాలని బీసీసీఐ భావించింది. అందుకోసం ఈసారి నటరాజన్ విడిచిపెట్టాలని టీఎన్‌సీఏను కోరింది. ఇందుకు సంఘం కూడా ఒప్పుకుంది. ఈ సందర్భంగా టీఎన్‌సీఏ సెక్రటరీ రామసామి మీడియాతో పలు విషయాలను వెల్లడించారు.

ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు నటరాజన్‌ కావాలని బీసీసీఐ అడగడంతో మేం ఒప్పుకొన్నామని తెలిపారు. నట్టూ స్థానంలో జగన్నాథ్‌ శ్రీనివాస్‌ అనే ఆటగాడిని తమ జట్టులో చేర్చుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని టీఎన్‌సీఏ చీఫ్‌ సెలెక్టర్‌ వాసుదేవన్‌ కూడా ధ్రువీకరించారు. కాగా, ఇటీవల జరిగిన సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో తమిళనాడు జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి టెస్టులో ఓటమిపాలైన కోహ్లీసేన రెండో మ్యాచ్‌లో గెలవాలని చూస్తోంది. ఈ టెస్టు సిరీస్‌ అనంతరం ఇరు జట్లూ ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడనున్నాయి. ఈ క్రమంలోనే ఆయా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నటరాజన్‌ను ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది.

నటరాజన్‌‌పై ప్రశంసల జల్లు.. రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కీలక బౌలర్‌ అవుతాడన్న కోహ్లీ