T20 World Cup: అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్‌.. ఐసీసీ ప్రకటన!

|

Jun 29, 2021 | 5:04 PM

టీ20 ప్రపంచకప్‌ టోర్నీని ఐసీసీ మంగళవారం ట్విటర్‌ వేదికగా ఖరారు చేసింది. అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు పొట్టి ప్రపంచ కప్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

T20 World Cup: అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్‌.. ఐసీసీ ప్రకటన!
T20 World Cup 2021 (1)
Follow us on

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ టోర్నీని ఐసీసీ మంగళవారం ట్విటర్‌ వేదికగా ఖరారు చేసింది. అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు పొట్టి ప్రపంచ కప్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ టోర్నీని యూఏఈతో ఒమన్‌లో నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది. భారత్‌లో క‌రోనా సెకండ్ వేవ్ తో పొట్టి ప్రపంచ కప్ వేదికను మార్చాల్సి వచ్చింది. అయితే, యూఏఈలో నిర్వహించే టీ20 ప్రపంచ కప్‌ బీసీసీఐ ఆతిథ్యంలోనే జ‌రుగనుందని ఐసీసీ స్పష్టం చేసింది.

మొత్తం నాలుగు వేదిక‌ల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ద షేక్ జాయెద్‌ స్టేడియం(అబుదాబి), షార్జా స్టేడియం, దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియం, ఒమ‌న్ క్రికెట్ అకాడ‌మీ గ్రౌండ్‌లో మ్యాచ్‌ల‌ను నిర్వహించ‌నున్నారు. తొలి రౌండ్‌లో అర్హత సాధించిన 8 జ‌ట్లు.. రెండు గ్రూపులుగా విడిపోతాయని పేర్కొంది. ఒమ‌న్‌, యూఏఈ దేశాల్లో రెండు గ్రూపులుగా మ్యాచ్‌లు ఆడ‌తాయని పేర్కొంది. ఈ జ‌ట్ల నుంచి నాలుగు టీమ్‌లు సూప‌ర్‌12కు ఎంపికవుతాయి. 8 జట్లు ఇప్పటికే అర్హత సాధించగా, వీటితో ఆ నాలుగు జట్లు క‌లుస్తాయ‌ని ఐసీసీ త‌న ట్వీట్‌లో పేర్కొంది. కాగా టీ20 ప్రపంచకప్‌ వేదికలను భారత్‌ నుంచి యూఏఈకి తరలించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సోమవారం వెల్లడించిన సంగతి తెలిసిందే.

Also Read:

IPL 2022: కొత్త ఫ్రాంచైజీల కనీస విలువ రూ.2000 కోట్లు..! జులైలో విక్రయానికి రెడీ?

ఇంగ్లండ్ వీధుల్లో టీమిండియా ఉమెన్స్‌.. ఆటలోనే కాదు అందంలోనూ పోటీపడుతోన్న మిథాలీ సేన!

IND vs ENG 2021: ఇదే టీమిండియా బెస్ట్‌ ఓపెనింగ్ జోడీ: ఆకాశ్ చోప్రా