T20 World Cup 2021: బాబర్‎కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఇవ్వకపోవడంపై షోయబ్ అక్తర్ అసంతృప్తి.. ఇదేమిటంటూ ట్వీట్..

|

Nov 15, 2021 | 1:21 PM

టీ20 ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన కనబరిచి, జట్టును సెమీఫైనల్‌కు చేర్చినప్పటికీ, పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్‌ను ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుకు పరిగణించకపోవడంపై ఆ దేశ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ నిరాశ వ్యక్తం చేశాడు...

T20 World Cup 2021: బాబర్‎కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఇవ్వకపోవడంపై షోయబ్ అక్తర్ అసంతృప్తి.. ఇదేమిటంటూ ట్వీట్..
Aktar
Follow us on

టీ20 ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన కనబరిచి, జట్టును సెమీఫైనల్‌కు చేర్చినప్పటికీ, పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజమ్‌ను ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుకు పరిగణించకపోవడంపై ఆ దేశ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ నిరాశ వ్యక్తం చేశాడు. రెండో సెమీ-ఫైనల్‌లో వికెట్‌ కీపర్-బ్యాట్స్‌మన్ మాథ్యూ వేడ్ చెలరేగి ఆడటంతో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోయింది. అయితే బాబర్ అజామ్ టీ20 ప్రపంచకప్‌లో 303 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ 289 పరుగులతో ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు.

రన్ చార్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, బాబర్ ఆజం కంటే డేవిడ్ వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు లభించింది. దీనిపై షోయబ్ అక్తర్ స్పందించాడు. తన ట్వీట్‌లో డేవిడ్ వార్నర్ అవార్డును పొందడం పట్ల నిరాశ చెందానని, బాబర్ అజమ్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్‌ను లంభించాలని తాను నిజంగా ఆశిస్తున్నానని రాశాడు. డేవిడ్ వార్నర్ బాబర్ కంటే 14 పరుగులు తక్కువగా చేశాడని అన్నారు.

మిచెల్ మార్ష్‌తో కలిసి డేవిడ్ వార్నర్ న్యూజిలాండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. జట్టుకు విజయాన్ని అందించాడు. 173 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మిచెల్ మార్ష్ 77 పరుగులతో అజేయంగా రాణించడంతో పాటు డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 53)తో కలిసి 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. మార్ష్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇందులో ఇష్ సోధీ బౌలింగ్‌లో రెండు భారీ సిక్స్‎లు కొట్టాడు. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ 48 బంతుల్లో 85 రన్స్ చేశాడు.

Read Also.. David Warner’s wife: వ్యంగ్యంగా ట్వీట్ చేసిన డేవిడ్ వార్నర్ భార్య.. ఎవరిని ఉద్దేశించి చేసిందంటే..!