T20 World Cup Records : క్రికెట్ ప్రపంచాన్ని గడగడలాడించిన రికార్డులు.. టీమిండియా సృష్టించిన చరిత్ర మళ్ళీ సాధ్యమేనా?

T20 World Cup Records : పదో ఎడిషన్ టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి మన ముందుకు రాబోతోంది. భారత్, శ్రీలంక వేదికలుగా జరిగే ఈ టోర్నీలో 20 జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే, టోర్నీ మొదలవ్వకముందే వివాదాలు రాజుకున్నాయి. సెక్యూరిటీ కారణాల వల్ల బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ వచ్చింది.

T20 World Cup Records : క్రికెట్ ప్రపంచాన్ని గడగడలాడించిన రికార్డులు.. టీమిండియా సృష్టించిన చరిత్ర మళ్ళీ సాధ్యమేనా?
Team India

Updated on: Feb 04, 2026 | 6:51 PM

T20 World Cup Records : పదో ఎడిషన్ టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి మన ముందుకు రాబోతోంది. భారత్, శ్రీలంక వేదికలుగా జరిగే ఈ టోర్నీలో 20 జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే, టోర్నీ మొదలవ్వకముందే వివాదాలు రాజుకున్నాయి. సెక్యూరిటీ కారణాల వల్ల బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ వచ్చింది. ఇక పాకిస్థాన్ అయితే భారత్‌తో మ్యాచ్ ఆడబోమని, బాయ్‌కాట్ చేస్తామని చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో గత 9 టోర్నీలలో నమోదైన కొన్ని అద్భుతమైన రికార్డులను ఒకసారి నెమరువేసుకుందాం.

టీమిండియా టాప్.. రికార్డుల్లోనూ కింగ్‎లే

వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ (1,292 పరుగులు) పేరిట ఉంది. ఒకే టోర్నీలో అత్యధిక పరుగులు (319 – 2014లో) చేసిన ఘనత కూడా కోహ్లీదే. ఇక టీమిండియా ప్రస్తుత కోచ్ గౌతమ్ గంభీర్ 2007 ఫైనల్ హీరో అయితే, రోహిత్ శర్మ అత్యధిక మ్యాచ్‌లు (47) ఆడిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. 2024లో భారత్ అజేయంగా (ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా) కప్పు గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. ధోనీ అత్యధిక మ్యాచ్‌లకు (33) కెప్టెన్సీ వహించిన రికార్డును భద్రంగా ఉంచుకున్నాడు.

బ్యాటింగ్ విస్ఫోటనం.. బౌలింగ్ సంచలనం

టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక స్కోరు శ్రీలంక (260/6 vs కెన్యా, 2007) పేరిట ఉండగా, అత్యల్ప స్కోరు నెదర్లాండ్స్, ఉగాండా (39 పరుగులు) పేరిట ఉంది. యువరాజ్ సింగ్ 2007లో ఇంగ్లాండ్‌పై కొట్టిన 12 బంతుల హాఫ్ సెంచరీ ఇప్పటికీ ఫాస్టెస్ట్ రికార్డుగా కొనసాగుతోంది. వెస్టిండీస్ వీరుడు క్రిస్ గేల్ ఒక్కడే ఈ టోర్నీలో రెండు సెంచరీలు సాధించాడు. బౌలింగ్ విషయానికి వస్తే, ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ 2024 ఎడిషన్‌లో వరుసగా రెండు హ్యాట్రిక్‌లు సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్

భారత్, వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు మాత్రమే ఇప్పటివరకు రెండేసి సార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. ఇక ఫైనల్స్ విషయానికొస్తే.. భారత్, పాకిస్థాన్, ఇంగ్లాండ్, శ్రీలంక జట్లు అత్యధికంగా చెరో మూడు సార్లు ఫైనల్స్ చేరుకున్నాయి. 2024లో జరిగిన టోర్నీలో మొదటిసారిగా 16 నుంచి 20 జట్లకు సంఖ్యను పెంచారు, అదే సంప్రదాయం ఇప్పుడు 2026లోనూ కొనసాగుతోంది. శ్రీలంకలోని కొలంబోలో జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, రికార్డుల పరంగా చూస్తే భారత్ స్పష్టమైన ఆధిపత్యంతో కనిపిస్తోంది.

టీ20 వరల్డ్ కప్ విజేతల జాబితా

2007: భారత్

2009: పాకిస్థాన్

2010: ఇంగ్లాండ్

2012: వెస్టిండీస్

2014: శ్రీలంక

2016: వెస్టిండీస్

2021: ఆస్ట్రేలియా

2022: ఇంగ్లాండ్

2024: భారత్