టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి పాకిస్తాన్ దూసుకెళ్లింది. సూపర్ 12 మ్యాచ్‌లో నమీబియాపై 45 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఓపెనర్లు బాబర్, రిజ్వాన్ మరోసారి సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడంతో పాకిస్తాన్ భారీ స్కోరు చేసింది. మొదట్లో కాస్త నెమ్మదిగా ఇన్నిగ్స్ ప్రారంభించింది. 10 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 59/0 ఉండగా తర్వాత పాక్ గేర్ మార్చింది. రిజ్వాన్ 50 బంతుల్లో 79(8 ఫోర్లు, నాలుగు సిక్స్‌లు) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కెప్టె్న్ బాబర్ అజామ్ 49 బంతుల్లో70(7ఫోర్లు)పరుగులు చేశాడు. 15వ ఓవర్లో బాబర్, ఆ తర్వాతి ఓవర్లో ఫకార్ జమాన్(5) ఔటైనా.. పాక్ జోరు తగ్గలేదు. రిజ్వాన్‌కు తోడు హఫీజ్16 బంతుల్లో 32( 5ఫోర్లు) పరుగులు చేశాడు. దీంతో చివరి 4 ఓవర్లలో పాకిస్తాన్ 62 పరుగులు రాబట్టింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నమీబియా 20 ఓనర్లలో 5 వికెట్లకు 144 పరుగులే చేసింది. దీంతో పాకిస్తాన్ 45 పరుగులతేడా ఘన విజయం సాధించింది. నమీబియా బ్యాటర్లలో వీజ్ 31 బంతుల్లో 43(మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లు) పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. క్రెయిగ్ విలియమ్స్ 37 బంతుల్లో 40 (ఐదు ఫోర్లు, ఒక సిక్స్)పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో ఇమాద్, హసన్ అలీ, రవూఫ్ ఒక్కో వికెట్ తీశారు. ఈ విజయంతో పాక్ సెమీస్‌లోకి దూసుకెళ్లింది.
గ్రూప్-2లో పాకిస్తాన్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో ఆప్ఘానిస్తాన్ ఉండగా.. మూడో స్థానంలో న్యూజిలాండ్ ఉంది. నాలుగు, ఐదు స్థానాల్లో నమిబీయా, ఇండియా ఉంది. ఆదివారం కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది.
Read Also.. T20 World Cup 2021: అశ్విన్‌ను ఎందుకు తీసుకోలేదు.. దీనిపై విచారణ చేయాలి.. వెంగ్‌సర్కార్..