T20 World Cup 2026: భారత్ సహా 6 జట్ల ప్రకటన.. కప్పు కొట్టే స్వ్కాడ్ ఇదే.. డేంజరస్ టీం భయ్యో

T20 World Cup 2026: భారత్‌లోని అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి నగరాలతో పాటు శ్రీలంకలోని కొలంబో, క్యాండీ స్టేడియాలు ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో (పాక్ ఫైనల్ చేరకపోతే) నిర్వహించే అవకాశం ఉంది.

T20 World Cup 2026: భారత్ సహా 6 జట్ల ప్రకటన.. కప్పు కొట్టే స్వ్కాడ్ ఇదే.. డేంజరస్ టీం భయ్యో
T20 World Cup 2026

Updated on: Jan 02, 2026 | 8:11 AM

T20 World Cup 2026: క్రికెట్ ప్రపంచంలో మరో మహా సంగ్రామానికి తెరలేవబోతోంది. 2026లో భారత్ వర్సెస్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది. ఇప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ ఇండియా సహా ఆరు ప్రధాన దేశాలు తమ ప్రాథమిక స్క్వాడ్‌లను ప్రకటించాయి. ఈ మెగా టోర్నీలో ఏ జట్లు తలపడనున్నాయి, భారత్ గ్రూపులో ఉన్న ప్రత్యర్థులు ఎవరు, ఈసారి ఫేవరెట్‌గా నిలిచే జట్టు ఏదో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్, శ్రీలంక వేదికగా 20 జట్ల పోరు: 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనున్న ఈ టీ20 ప్రపంచ కప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా (A, B, C, D) విభజించారు. ప్రతి గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. ఆతిథ్య దేశాలుగా భారత్, శ్రీలంక నేరుగా అర్హత సాధించగా, మిగిలిన జట్లు గత టోర్నీ ప్రదర్శన, క్వాలిఫైయర్ మ్యాచ్‌ల ద్వారా చోటు దక్కించుకున్నాయి.

టీమ్ ఇండియా స్క్వాడ్ ప్రకటన – సూర్యకుమార్ సారథ్యం:

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్, అందరికంటే ముందుగా తమ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20ల నుంచి తప్పుకున్న తర్వాత జరుగుతున్న మొదటి ప్రపంచ కప్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లకు చోటు దక్కగా, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు.

ఇవి కూడా చదవండి

ప్రకటించిన ప్రధాన జట్లు ఇవే: ప్రస్తుతం భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఓమన్, శ్రీలంక జట్లు తమ స్క్వాడ్‌లను దాదాపు ఖరారు చేశాయి.

టీ20 ప్రపంచకప్ 2026 కోసం టీమిండియా – సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కె.ఎ. (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్.

ఆస్ట్రేలియా – మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోల్లీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.

శ్రీలంక (ప్రాథమిక జట్టు) – దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కమిల్ మిషార, కుసల్ పెరీరా, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్‌వెల్లా, జనిత్ లియానాగే, చరిత్ అసలంక, కమిందు మెండిస్, పవన్ రత్నాయకే, వాహన్ అరాచ్చిగే, వాహన్ అరాచ్చిగే రత్నాయక్, నువాన్ తుషార, ఇషాన్ మలింగ, దుష్మంత చమీర, ప్రమోద్ మదుషన్, మతీషా పతిరణ, దిల్షన్ మదుశంక, మహేష్ తీక్షణ, దుషన్ హేమంత, విజయకాంత్ వ్యాస్కాంత్, ట్రెవిన్ మాథ్యూ.

ఒమన్- జతీందర్ సింగ్ (కెప్టెన్), వినాయక్ శుక్లా, మహ్మద్ నదీమ్, షకీల్ అహ్మద్, హమ్మద్ మీర్జా, వసీమ్ అలీ, కరణ్ సోనావాలే, షా ఫైసల్, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మహమూద్, జే ఒడెదర, షఫీక్ జాన్, ఆశిష్ ఒడెదర, జితేన్ రమణాది, హస్నా అలీ, హస్నా.

ఇంగ్లాండ్ – హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.

ఆఫ్ఘనిస్తాన్ – రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, సెదిఖుల్లా అటల్, ఫజల్‌హక్ ఫరూఖీ, రహ్మానుల్లా గుర్బాజ్, నవీన్-ఉల్-హక్, మహ్మద్ ఇషాక్, షాహిదుల్లా కమల్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నయీబ్, అజ్మతుల్లాహ్ ఉమర్-అజ్మతుల్లా, ఆర్జిమతుల్లా రసూలీ, ఇబ్రహీం జద్రాన్.

అత్యంత ప్రమాదకరమైన గ్రూప్ ఏది?..

ఈసారి ‘గ్రూప్-ఎ’ అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇందులో భారత్, పాకిస్థాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. భారత్-పాక్ మధ్య పోరు ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనుంది. మరోవైపు గ్రూప్-సిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ వంటి బలమైన జట్లు ఉండటంతో సెమీస్ చేరేందుకు తీవ్ర పోటీ నెలకొననుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..