T20 World Cup 2026: సెమీఫైనల్ చేరే 4 జట్లు ఫిక్స్.. టీమిండియా, శ్రీలంకకు దిమ్మతిరిగే షాక్..?

Super 8 Semifinal Qualification Chances: సూపర్ 8 నుంచి సెమీ ఫైనల్ దిశగా చేరే జట్లు ఏవో క్రమంగా బయటకు వస్తోంది. గ్రూప్ ఏ నుంచి సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు తమ అవకాశాలను భారీగా పెంచుకున్నాయి. దీంతో టీమిండియాకు చాలా కష్టంగా మారింది.

T20 World Cup 2026: సెమీఫైనల్ చేరే 4 జట్లు ఫిక్స్.. టీమిండియా, శ్రీలంకకు దిమ్మతిరిగే షాక్..?
T20 World Cup 2026

Updated on: Feb 24, 2026 | 6:30 AM

Super 8 Semifinal Qualification Chances: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్–8 దశలో ఉన్న ప్రతి జట్టు లక్ష్యం ఒక్కటే – సెమీఫైనల్ చేరడం. అయితే అందులోకి వెళ్లే అవకాశం కేవలం నాలుగు జట్లకే ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ జట్లు ముందంజలో ఉన్నాయి? ఏ జట్ల ఆశలు తగ్గాయి? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే – టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న జట్లైన భారత్, శ్రీలంకలపైనే సెమీఫైనల్‌కు చేరకముందే నిష్క్రమించే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. భారత్–దక్షిణాఫ్రికా మ్యాచ్ అనంతరం వచ్చిన గణాంకాల ఆధారంగా ఈ అంచనాలు వెలువడ్డాయి. ఈ లెక్కల ప్రకారం పాకిస్థాన్ పరిస్థితి భారత్, శ్రీలంక కంటే మెరుగ్గా ఉంది.

సౌతాఫ్రికా ఆశలు అత్యధికం, భారత్ ఆశలు అత్యల్పం..

ప్రస్తుత దశలో సూపర్–8 నుంచి సెమీఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్న జట్టు దక్షిణాఫ్రికా. గ్రూప్–ఏ నుంచి మొదటి సెమీఫైనలిస్ట్‌గా సౌతాఫ్రికా నిలిచే అవకాశం ఉందని అంచనా. గణాంకాల ప్రకారం సౌతాఫ్రికా సెమీఫైనల్ చేరే అవకాశం సుమారు 90 శాతంగా పేర్కొంటున్నారు.

దక్షిణాఫ్రికా తర్వాత వెస్టిండీస్ టీం సెమీఫైనల్ చేరే అవకాశాలు 90 శాతంగా ఉంది. మరోవైపు, గ్రూప్–ఏలో భారత్జ, జింబాబ్వే జట్లు చివరలో నిలిచాయ. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ సెమీఫైనల్ చేరే అవకాశం కేవలం 30 శాతం మాత్రమేనని అంచనా వేస్తున్నారు. అంటే, ఆతిథ్య జట్టైన భారత్‌కు ప్రమాదం ముంచుకొస్తోంది.

గ్రూప్–బీలో శ్రీలంక ఆశలు పాకిస్థాన్ కంటే తక్కువగా..

సూపర్–8 గ్రూప్–బీ పరిస్థితిని పరిశీలిస్తే, ఇంగ్లాండ్ సెమీఫైనల్ చేరే రేసులో ముందంజలో ఉంది. ఇంగ్లాండ్‌కు సెమీఫైనల్ చేరే అవకాశం సుమారు 80 శాతంగా అంచనా. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లకు అవకాశాలు 50–50గా ఉన్నాయి. అంటే గ్రూప్–బీ నుంచి రెండో జట్టు పాకిస్థాన్ లేదా న్యూజిలాండ్‌లో ఎవరో ఒకరు అయ్యే అవకాశముంది.

ఆశ్చర్యకరంగా, శ్రీలంకకు సెమీఫైనల్ చేరే అవకాశం కేవలం 20 శాతం మాత్రమేనని అంచనా. అంటే, శ్రీలంకకు సూపర్–8 దశలోనే బయటకు వెళ్లే ప్రమాదం ఎక్కువగా ఉంది.

ప్రస్తుత సూపర్–8 పరిస్థితుల్లో సెమీఫైనల్ రేసులో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ ముందంజలో ఉన్నాయి. వెస్టిండీస్, జింబాబ్వే, పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగుతోంది. అయితే టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న భారత్, శ్రీలంక జట్లకు సెమీఫైనల్ చేరే ఆశలు తగ్గడం క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చే అంశంగా మారింది. మిగిలిన మ్యాచ్‌ల ఫలితాలే సెమీఫైనల్ చిత్రాన్ని పూర్తిగా నిర్ణయించనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us