
T20 World Cup Super 8 Schedule: టీ20 వరల్డ్ కప్ 2026లో సూపర్-8 దశకు అర్హత సాధించిన జట్ల జాబితా పూర్తిగా వెల్లడైంది. గ్రూప్-Aలో పాకిస్తాన్ చివరి మ్యాచ్‌లో నమీబియాను ఓడించిన తర్వాత సూపర్-8 లైనప్ ను ఖరారు చేసుకుంది. గ్రూప్-A నుంచి డిఫెండింగ్ చాంపియన్స్ అయిన భారత్, పాకిస్తాన్ అర్హత సాధించగా, గ్రూప్-B నుంచి శ్రీలంక, జింబాబ్వే అర్హత సాధించాయి. అలాగే, గ్రూప్-C నుంచి వెస్టిండీస్, ఇంగ్లాండ్ టాప్ టీమ్‌లుగా నిలిచాయి. గ్రూప్-D నుంచి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్-8కు చేరాయి. ముందుగానే అంచాన వేసినట్లే సూపర్ 8 చేరిన టీంలలో ఒక్క ఆస్ట్రేలియా జట్టు మాత్రమే లేదు. ఆ స్థానంలో జింబాబ్వే చేరింది. కాగా, ప్రస్తుతం అందరిచూపు ఈ జట్టుపైనే నిలిచింది. సూపర్ 8లో ఏ జట్టుకు షాక్ ఇవ్వనుందోనని మాట్లాడుకుంటున్నారు.
సూపర్-8 దశలో మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా (ప్రతి గ్రూప్‌లో నాలుగు జట్లు) విభజించారు. ప్రతి గ్రూప్‌లో టాప్-2 జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.
గ్రూప్ 1: భారత్, జింబాబ్వే, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా
గ్రూప్ 2: పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్
ఫిబ్రవరి 22: భారత్ vs దక్షిణాఫ్రికా – నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ (సా. 7 గంటలకు)
ఫిబ్రవరి 23: జింబాబ్వే vs వెస్టిండీస్ – వాంఖడే స్టేడియం, ముంబై (సా. 7 గంటలకు)
ఫిబ్రవరి 26: దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ – నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ (మ. 3 గంటలకు)
ఫిబ్రవరి 26: భారత్ vs జింబాబ్వే – ఎం.ఏ. చిదంబరం స్టేడియం, చెన్నై (సా. 7 గంటలకు)
మార్చి 1: జింబాబ్వే vs దక్షిణాఫ్రికా – అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ (మ. 3 గంటలకు)
మార్చి 1: భారత్ vs వెస్టిండీస్ – ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా (సా. 7 గంటలకు)
ఫిబ్రవరి 21: న్యూజిలాండ్ vs పాకిస్తాన్ – ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో (సా. 7 గంటలకు)
ఫిబ్రవరి 22: ఇంగ్లాండ్ vs శ్రీలంక – పల్లెకెలె క్రికెట్ స్టేడియం, కాండీ (మ. 3 గంటలకు)
ఫిబ్రవరి 24: ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ – పల్లెకెలె క్రికెట్ స్టేడియం, కాండీ (సా. 7 గంటలకు)
ఫిబ్రవరి 25: న్యూజిలాండ్ vs శ్రీలంక – ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో (సా. 7 గంటలకు)
ఫిబ్రవరి 27: ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ – ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో (సా. 7 గంటలకు)
ఫిబ్రవరి 28: పాకిస్తాన్ vs శ్రీలంక – పల్లెకెలె క్రికెట్ స్టేడియం, కాండీ (సా. 7 గంటలకు)
ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో సూపర్-8కు అర్హత సాధించిన జట్లు 2028లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో జరిగే తదుపరి వరల్డ్ కప్‌కు ఆటోమేటిక్‌గా అర్హత పొందుతాయి.
2028 టోర్నమెంట్‌కు సహ-ఆతిథ్య దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు ఇప్పటికే నేరుగా అర్హత లభించింది. క్వాలిఫికేషన్ నిబంధనల ప్రకారం, సూపర్-8కు వచ్చిన అన్ని జట్లు 2028 ఎడిషన్‌కు తమ స్థానం ఖరారు చేసుకున్నాయి.
మొత్తం 12 ఆటోమేటిక్ క్వాలిఫయర్ల జాబితాను మార్చి 9 నాటికి (ఫైనల్ తర్వాత రోజు) ఐసీసీ టీ20ఐ టీమ్ ర్యాంకింగ్స్‌లో ఉన్న టాప్-3 జట్లతో పూర్తి చేస్తారు. ప్రస్తుతం బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, ఐర్లాండ్ జట్లు ఈ స్థానాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంది.
మిగిలిన 8 స్థానాలు ప్రాంతీయ క్వాలిఫికేషన్ మార్గం ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రతి ప్రాంతం నుంచి పోటీ సామర్థ్యాన్ని బట్టి సీట్లు కేటాయిస్తారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..