Super 8 Schedule: గ్రూప్ ఆఫ్ డెత్‌లో డేంజరస్ జట్లు.. హోరాహోరీ సిద్ధమైన 4 జట్లు.. సూపర్ 8 పూర్తి షెడ్యూల్ ఇదే..

|

Jun 16, 2024 | 1:40 PM

T20 World Cup 2024 Super-8 Schedule: టీ20 ప్రపంచ కప్ 2024 గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగింపునకు చేరుకున్నాయి. గ్రూప్ దశలో చివరి మ్యాచ్ జూన్ 17న వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగనుంది. దీని తర్వాత సూపర్-8 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు మొత్తం 7 జట్లు సూపర్-8కి అర్హత సాధించాయి. అయితే, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ నుంచి ఏదైనా ఒక జట్టు మిగిలిన స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు.

Super 8 Schedule: గ్రూప్ ఆఫ్ డెత్‌లో డేంజరస్ జట్లు.. హోరాహోరీ సిద్ధమైన 4 జట్లు.. సూపర్ 8 పూర్తి షెడ్యూల్ ఇదే..
Super 8 T20 World Cup
Follow us on

T20 World Cup 2024 Super-8 Schedule: టీ20 ప్రపంచ కప్ 2024 గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగింపునకు చేరుకున్నాయి. గ్రూప్ దశలో చివరి మ్యాచ్ జూన్ 17న వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగనుంది. దీని తర్వాత సూపర్-8 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటివరకు మొత్తం 7 జట్లు సూపర్-8కి అర్హత సాధించాయి. అయితే, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ నుంచి ఏదైనా ఒక జట్టు మిగిలిన స్థానాన్ని కైవసం చేసుకోవచ్చు.

సూపర్-8లోని దాదాపు అన్ని జట్లూ ఖరారయ్యాయి. ఇటువంటి పరిస్థితిలో తదుపరి రౌండ్‌లో ఏ జట్టు ఎవరితో పోటీపడుతుందో కూడా తేలింది. సూపర్-8 పూర్తి షెడ్యూల్ ఏమిటో, గ్రూప్-1, గ్రూప్ 2లోని జట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

గ్రూప్ 1..

ఈ గ్రూప్‌లో భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉన్నాయి. ఇది కాకుండా బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌ల నుంచి మరో జట్టు అర్హత సాధిస్తుంది.

గ్రూప్ 2..

ఈ సమూహాన్ని గ్రూప్ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే ఇందులో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, USA, ఇంగ్లాండ్ జట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ నాలుగు జట్లూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాయి. ఏ జట్టు ఎవరినైనా ఓడించగలదు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద జట్ల మధ్య పోరు తప్పదని భావిస్తున్నారు.

సూపర్ 8 మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్..

20 జూన్

ఆఫ్ఘనిస్తాన్ vs భారతదేశం

ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్/బంగ్లాదేశ్

21 జూన్

ఇంగ్లండ్ vs సౌతాఫ్రికా

USA vs వెస్టిండీస్

22 జూన్

ఇండియా vs నెదర్లాండ్స్/బంగ్లాదేశ్

ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా

23 జూన్

USA vs ఇంగ్లాండ్

వెస్టిండీస్ vs సౌతాఫ్రికా

24 జూన్

ఆస్ట్రేలియా vs భారతదేశం

ఆఫ్ఘనిస్తాన్ vs నెదర్లాండ్స్/బంగ్లాదేశ్

భారత జట్టు మ్యాచ్‌ల గురించి మాత్రమే మాట్లాడితే, టీమ్ ఇండియా గ్రూప్ చాలా సులభంగా ఉంది. జూన్ 20న ఆఫ్ఘనిస్థాన్‌తో సూపర్-8లో భారత జట్టు తన తొలి మ్యాచ్ ఆడనుంది. దీని తర్వాత టీమిండియా తదుపరి మ్యాచ్ జూన్ 22న జరగనుంది. ఈ సమయంలో, సూపర్-8లో ఏ జట్టు అర్హత సాధిస్తే అంటే బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్‌లతో ఏదో ఒక జట్టుతో భారత్ తలపడుతుంది. ఆ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో పోటీపడాల్సి ఉండగా ఈ మ్యాచ్ జూన్ 24న జరగనుంది. మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు గెలిస్తే భారత జట్టు సెమీస్‌లో చోటు దక్కించుకుంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..