టీ20 మాన్‌స్టర్‌రా.. ఈ ప్లేయర్! ఒక్క ఓవర్‌లో 36 పరుగులు.. 2 సిక్సర్లు, 2 ఫోర్లతో ఊహకందని ఊచకోత

|

Jun 18, 2024 | 11:49 AM

టీ20ల్లో వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ ఎంతటి పేలుడు బ్యాట్స్‌మెనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతనిదే ఆ రోజైతే.. ప్రత్యర్ధులకు ఊచకోత ఖాయం అని చెప్పొచ్చు. సరిగ్గా ఇదే తరహాలో ప్రత్యర్ధి బౌలర్లను బెంబేలెత్తించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో వెస్టిండీస్ తమ చివరి గ్రూప్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్‌తో..

టీ20 మాన్‌స్టర్‌రా.. ఈ ప్లేయర్! ఒక్క ఓవర్‌లో 36 పరుగులు.. 2 సిక్సర్లు, 2 ఫోర్లతో ఊహకందని ఊచకోత
Nicholas Pooran
Follow us on

టీ20ల్లో వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ ఎంతటి పేలుడు బ్యాట్స్‌మెనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతనిదే ఆ రోజైతే.. ప్రత్యర్ధులకు ఊచకోత ఖాయం అని చెప్పొచ్చు. సరిగ్గా ఇదే తరహాలో ప్రత్యర్ధి బౌలర్లను బెంబేలెత్తించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో వెస్టిండీస్ తమ చివరి గ్రూప్ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్‌తో తలబడింది. ఆ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తక్కువ పరుగులకే తొలి వికెట్‌‌గా బ్రాండన్‌ కింగ్‌ వెనుదిరిగాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన పూరన్ తన మాస్ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. క్రీజులోకి రాగానే నవీన్ ఉల్ హక్‌తో వాగ్వాదం.. ఆ తర్వాత బౌలర్ అజ్మతుల్లా ఒమర్జాయ్‌కు విశ్వరూపం చూపించాడు.

ఇది చదవండి: అదే జరిగితే.. టీ20 ప్రపంచకప్‌ నుంచి అర్ధాంతరంగా టీమిండియా ఔట్.? లెక్కలివే

అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఒక ఓవర్లో నికోలస్ పూరన్ ఏకంగా 36 పరుగులు రాబట్టాడు. వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌లో ఒమర్జాయ్ వేసిన నాలుగో ఓవర్‌ ఇది. ఒమర్జాయ్ వేసిన తొలి బంతికి పూరన్ సిక్సర్ బాదాడు. దీని తర్వాత, రెండో బంతి నో బాల్, ఆ బంతిని పూరన్ బౌండరీగా మలిచాడు. ఆ నెక్స్ట్ ఒమర్జాయ్ వైడ్ రూపంలో 5 పరుగులు ఇచ్చాడు. ఇక ఈసారి ఒమర్జాయ్ అద్భుతమైన యార్కర్‌ వేయగా.. దాన్ని డాట్ బాల్‌గా వదిలేశాడు పూరన్. ఇక ఆ తర్వాత వరుసగా 4 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో మరో 20 పరుగులు రాబట్టాడు ఈ విండీస్ ప్లేయర్. దీంతో ఒమర్జాయ్ వేసిన 6 లీగల్ డెలివరీలకు 26 పరుగులు రాగా.. రెండు ఎక్స్‌ట్రా బంతులకు 10 పరుగులకు గానూ మొత్తంగా 36 పరుగులు ఒకే ఓవర్‌లో రాబట్టింది వెస్టిండీస్.

3 ఓవర్లలో 37 పరుగులు.. 4 ఓవర్లకు 73..

అజ్మతుల్లా ఒమర్జాయ్‌పై నికోలస్ పూరన్ విధ్వంసం.. విండీస్ జట్టుకు రన్‌రేట్ పెంచుకునే పని చేసి పెట్టిందని చెప్పొచ్చు. ఆ ఒక్క ఓవర్ దెబ్బకు వెస్టిండీస్ స్కోరు కేవలం 4 ఓవర్లలోనే 73 పరుగులకు చేరుకుంది. నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్‌కు ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మార్పులు చేయాల్సి వచ్చింది. ఆ వెంటనే.. ఐదు ఓవర్‌కు రషీద్ ఖాన్ స్వయంగా బౌలింగ్ చేశాడు. కాగా, మ్యాచ్ అనంతరం పూరన్ బ్యాటింగ్‌పై ఆఫ్ఘన్ బౌలర్ నవీన్-ఉల్-హక్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఇది చదవండి: అరె మావా.! దమ్ముంటే ఈ ఫోటోలో పామును గుర్తించు.. కనిపెడితే ఖిలాడీవి నువ్వే

క్రీజులోకి వచ్చినప్పటి నుంచే నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాలనే లక్ష్యంగా బరిలోకి దిగాడని చెప్పుకొచ్చాడు. వీరిద్దరూ కూడా ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతోన్న సంగతి తెలిసిందే. అటు ఈ మ్యాచ్ ఫలితం రెండు జట్లపైనా ఎలాంటి ప్రభావం చూపించదు. అటు విండీస్, ఇటు ఆఫ్ఘనిస్తాన్ రెండూ కూడా ఇప్పటికే సూపర్-8 దశకు చేరుకున్నాయి.

ఇది చదవండి: పేరుకేమో సూపర్‌స్టార్.. ఒక్క పరుగు చేయలేదు.. ఒక్క వికెట్ తీయలేదు.. టీమిండియాకి పట్టిన శని అతడే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..