IND vs AFG: ఇండియా వర్సెస్ అఫ్గాన్ మ్యాచ్ మిస్ అయ్యారా? మ్యాచ్ హైలెట్స్ మీకోసమే.. చూసేయండి

|

Jun 21, 2024 | 6:39 AM

India vs Afghanistan, T20 World Cup 2024: సూపర్-8 పోటీల్లో భాగంగా గురువారం (జూన్ 20)న ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

IND vs AFG: ఇండియా వర్సెస్ అఫ్గాన్ మ్యాచ్ మిస్ అయ్యారా?  మ్యాచ్ హైలెట్స్ మీకోసమే.. చూసేయండి
India Vs Afghanistan
Follow us on

India vs Afghanistan, T20 World Cup 2024: సూపర్-8 పోటీల్లో భాగంగా గురువారం (జూన్ 20)న ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. సూర్యకుమార్ యాదవ్ అద్భుత అర్ధ సెంచరీకి తోడు హార్దిక్ పాండ్యా రాణించడంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అఫ్గాన్ టీమ్ కు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఒత్తిడిలోకి నెట్టారు. ఫలితంగా ఆఫ్ఘన్ జట్టు 20 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ చెరో 3 వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. అక్షర్-జడేజాలకు ఒక్కో వికెట్ దక్కింది. ఆఫ్ఘన్ జట్టులో అజ్మతుల్లా ఓమ్జాయ్ అత్యధికంగా 26 పరుగులు చేశాడు.

ఫుల్ మ్యాచ్ హైలెట్స్ ఇదిగో..

రాణించిన సూర్య, హార్దిక్..

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా సూర్యకుమార్ యాదవ్ అద్భుత హాఫ్ సెంచరీ, హార్దిక్ పాండ్యా భాగస్వామ్యంతో భారీ స్కోరు చేసింది. ఎప్పటిలాగే ఈ మ్యాచ్‌లోనూ భారత్‌కు శుభారంభం లభించలేదు. కేవలం 8 పరుగులకే కెప్టెన్ రోహిత్ తన వికెట్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత పంత్ కూడా 20 పరుగులకే పెవిలియన్ చేరాడు. గత మూడు మ్యాచ్‌ల్లో సింగిల్ ఫిగర్స్‌తో నిరాశపర్చిన కోహ్లి ఈ మ్యాచ్‌లో 24 పరుగులు చేసినా అందుకు 24 బంతులు తీసుకున్నాడు. ఆ తర్వాత చేరిన సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. సూర్యకుమార్ 28 బంతుల్లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. అతడితో పాటు భారత వైస్ కెప్టెన్ హార్దిక్ 24 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేశాడు. అలాగే వీరిద్దరూ ఐదో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించారు. చివర్లో అక్షర్ పటేల్ కొన్ని మంచి షాట్లు ఆడి జట్టును 180 పరుగుల మార్కును దాటించాడు. అఫ్గానిస్థాన్‌ తరఫున ఫజల్‌హాక్‌ ఫరూఖీ, కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ చెరో మూడు వికెట్లు తీశారు.

 

 

గ్రూప్‌లో అగ్రస్థానంలో భారత్..

భారత్ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అఫ్గనిస్తాన్ జట్టులో అజ్మతుల్లా ఒమర్జాయ్ 20 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లోనూ భారత బౌలర్లు ధీటుగా రాణించి స్కోరును కాపాడుకోగలిగారు. శనివారం (జూన్22) బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. సూపర్ 8 దశలో గ్రూప్ 1లో భారత్ రెండు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

ఇరుజట్ల ప్లేయింగ్ 11..

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.

ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫరూజ్కాల్హాక్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..