ICC T20 World Cup 2021, IND vs PAK: టీ 20 వరల్డ్ కప్ 2021 కోసం టీమిండియా సన్నాహాలు మంచి ఫలితాలనే ఇచ్చాయి. వార్మప్ మ్యాచ్‌లలో ఈమేరకు అద్భుత ఫలితాలు కనిపించాయి. భారత్ మొదట ఇంగ్లండ్‌ని సులభంగా ఓడించింది. ఆ తర్వాత బుధవారం ఆస్ట్రేలియాపై కూడా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. భారత జట్టులోని ప్రధాన బ్యాట్స్‌మెన్‌ల బ్యాట్‌ల నుంచి పరుగుల వరద పారింది. కేఎల్ రాహుల్ తన ఐపీఎల్ 2021 ఫాంను ఇక్కడ కూడా కొనసాగించాడు. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ చేసి శుభ సంకేతాలు అందిచాడు. బౌలింగ్‌లో కూడా భారత్ అనేక సానుకూల ఫలితాలను సాధించింది.
టీమిండియా ఆటగాళ్లందరూ పాకిస్తాన్‌తో మ్యాచుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్లేయింగ్ XIలో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక కెప్టెన్ కోహ్లీకి తలనొప్పిగా మారింది. ప్రపంచంలోని ప్రతి కెప్టెన్ అలాంటి సమస్యను కోరుకోవడం సాధారణమే.. అయినా ప్రస్తుతం భారత్ టీంతో మాత్రం మరింత కఠినంగా మారింది. విరాట్ కోహ్లీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్స్‌ను ఇప్పటికే ఫిక్స్ చేశాడు. రోహిత్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనున్నారు. అయితే సమస్య హార్దిక్ పాండ్య స్థానంలో నెలకొంది. హార్దిక్ పాండ్య రెండు వార్మప్ మ్యాచ్‌లలో ఎక్కువగా ఆడే అవకాశం రాలేదు. పాండ్యా తనకు వచ్చిన కొద్దిపాటి ఇన్నింగ్స్‌లో కష్టపడుతున్నట్లు కనిపించాడు. పాండ్యా తన పేలవమైన ఫామ్‌లో ఉన్నప్పటికీ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఇవ్వాలా? వద్దా? అనే సందిగ్ధంలో పడిపోయారు.
విరాట్-ధోనీకి మరో సమస్య శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్ రూంలో వచ్చింది. మొదటి వార్మప్ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ విఫలమయ్యాడు. భువీ తన 4 ఓవర్ల కోటాలో 54 పరుగులు ఇచ్చాడు. వికెట్ కూడా తీసుకోలేదు. కానీ, ఆస్ట్రేలియాపై మాత్రం ఘనంగా పునరాగమనం చేయడంతో మెంటార్ ధోనితోపాటు, కోహ్లీకి పెద్ద సమస్యగా మారింది. భువీ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. మొదటి మ్యాచ్‌లో భువీ విఫలమయ్యాక, శార్దూల్ ఠాకూర్‌ను జట్టులో ఉంచేలా చర్చ జరిగింది. శార్దుల్ బౌలింగ్ ఫామ్ అద్భుతంగా ఉంది. అతను లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడంతో అతని వైపే మొగ్గుచూపారు. పాండ్య ఫామ్‌లో లేనందున శార్దూల్ ఠాకూర్ కీలకంగా మారాడు. కానీ, భువి బాగా బౌలింగ్ చేయడంతో పాక్‌తో ఆడే ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరికి చోటు దక్కనుందో పెద్ద ప్రశ్నగా మారింది.
టీమిండియాకు ఆర్ అశ్విన్ మూడో అతిపెద్ద సమస్యను సృష్టించాడు. మొదటి ప్లేయింగ్ ఎలెవన్ రేసులో అశ్విన్ చాలా దూరంలో కనిపించాడు. కానీ, వార్మప్ మ్యాచ్‌లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఆస్ట్రేలియాపై అశ్విన్ 8 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. టీమిండియా రెండో స్పిన్నర్‌గా అశ్విన్‌కు అవకాశం ఇస్తుందా లేక వరుణ్ చక్రవర్తిపైనే నమ్మకం ఉంచుతుందా అనేది చూడాలి. రాహుల్ చాహర్ కూడా రేసులో ఉన్నాడు. ఆస్ట్రేలియాపై బాగా బౌలింగ్ చేసి, ప్లేయింగ్ XIలో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు.
టీమిండియాకు నాలుగో పెద్ద సమస్య ఏమిటంటే, రెండు వార్మప్ మ్యాచ్‌లలో లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసి ఉంటే, బౌలర్లు ఎలా రాణించేవారో తెలిసేది. కానీ, అలా జరగలేదు. ఒత్తిడిలో బౌలర్లు ఎలా బౌలింగ్ చేస్తారో తెలిసేది. ఆ అవకాశం భారత్‌కు దక్కలేదు.