T20 World Cup 2021: గుడ్ ‌న్యూస్ చెప్పిన బీసీసీఐ.. కివీస్‌తో పోరుకు ఆ బ్యాట్స్‌మెన్ సిద్ధం..!

|

Oct 26, 2021 | 8:49 PM

T20 World Cup 2021, IND vs NZ: ఆదివారం (అక్టోబర్ 24) టీ20 వరల్డ్ కప్ 2021లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో టీమ్ ఇండియా మ్యాచ్ సందర్భంగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా భుజానికి గాయమైంది.

T20 World Cup 2021: గుడ్ ‌న్యూస్ చెప్పిన బీసీసీఐ.. కివీస్‌తో పోరుకు ఆ బ్యాట్స్‌మెన్ సిద్ధం..!
Follow us on

T20 World Cup 2021, IND vs NZ: ఆదివారం (అక్టోబర్ 24) టీ20 వరల్డ్ కప్ 2021లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో టీమ్ ఇండియా మ్యాచ్ సందర్భంగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా భుజానికి గాయమైంది. అతను పూర్తి ఫిట్‌నెస్‌‌తోపాటు అక్టోబరు 31న న్యూజిలాండ్‌తో జరిగే భారత్ తదుపరి మ్యాచ్‌కి అందుబాటులో ఉండటంపై ప్రశ్నార్థకంగా మారింది. మెన్ ఇన్ బ్లూ హార్దిక్ గాయానికి సంబంధించిన గుడ్ న్యూస్ వచ్చింది. పాండ్యా గాయానికి సంబంధించిన స్కాన్‌లలో ఎలాంటి ప్రమాదం లేదని తెలిసింది. కేవలం భుజం గాయంతో మాత్రమే బాధపడ్డాడని వైద్యులు తెలిపాదు. దీంతో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచుకు ఫిట్‌గా ఉంటాడని భావిస్తున్నారు. భారత్ తన రెండో గేమ్‌కు మొత్తం ఆరు రోజుల విరామం వచ్చింది. ఈలోపు హార్దిక్ పూర్తిగా కోలుకోవడాని తెలుస్తోంది.

“అవును, హార్దిక్ స్కాన్ నివేదికలు వచ్చాయి. గాయం తీవ్రమైనది కాదు. అలాగే, రెండు గేమ్‌ల మధ్య ఆరు రోజుల గ్యాప్ ఉండటంతో హర్దిక్ కోలుకోవడానికి తగినంత సమయం ఉంది” అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో దశ అంతటా ముంబై ఇండియన్స్ (ఎంఐ) తరఫున బౌలింగ్ చేయకుండా నిలిచిన హార్దిక్, టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున కేవలం బ్యాట్స‌మెన్‌గా ఆడుతున్నాడు. హార్దిక్ బౌలింగ్ చేయకపోయినా, మ్యాచ్ మధ్యలో కొంచెం అసౌకర్యంగా కనిపించాడు.

కెప్టెన్ విరాట్ కోహ్లి (57) అద్భుత అర్ధ సెంచరీ సహాయంతో భారత్ 20 ఓవర్లలో 151 పరుగుల మోస్తరు స్కోరు నమోదు చేయడంతో హార్దిక్ ఏడో నంబర్‌లో బ్యాటింగ్‌కు దిగాడు. మొత్తం 8 బంతుల్లో 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రిషబ్ పంత్ 39 పరుగులతో ధనాధన్ బ్యాటింగ్ చేసి ఆకట్టుకున్నాడు.

కెప్టెన్ బాబర్ అజామ్ తన ఓపెనింగ్ భాగస్వామి మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి మరో 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించడంతో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బాబర్ 52 బంతుల్లో అజేయంగా 68 పరుగులు చేయగా, రిజ్వాన్ 55 బంతుల్లో 79 పరుగులు చేసి ప్రపంచ కప్‌లో భారత్‌పై పాకిస్తాన్‌ మొదటి విజయాన్ని అందించారు.

ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే రెండో సూపర్ 12 పోరులో భారత్ విజయపథంలోకి దూసుకెళ్లాలని చూస్తోంది. లేదంటే సెమీస్‌ నుంచి దూరమయ్యే పరిస్థితి నెలకొంటుంది.

Also Read: T20 World Cup 2021: ప్రమాదంలో దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ కెరీర్.. చర్యలకు సిద్ధమైన బోర్డు.. ఎందుకంటే?

PAK vs NZ, T20 World Cup 2021: టాస్ గెలిచిన పాకిస్తాన్.. ప్లేయింగ్ XIలో ఎవరున్నారంటే?