Indian Cricket Team: టీ20 ప్రపంచకప్ 2021లో ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆకట్టుకోగా, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కూడా తన సహకారం అందించాడు. షమీ 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అయితే ఇలాంటి గొప్ప ప్రదర్శన చేసినా షమీని టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. టీమ్ ఇండియా తన ప్లేయింగ్ ఎలెవన్ గురించి మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ భావిస్తున్నారు. మహమ్మద్ షమీ కంటే మెరుగైన టీ20 బౌలర్లు భారత జట్టులో ఎందరో ఉన్నారని తెలిపారు.
దఫా న్యూస్‌లో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ, ‘భారత్ తన జట్టుపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను. టీ20ల్లో మెరుగైన బౌలర్లు ఎందరో ఉన్నారు. మహ్మద్ షమీ గురించి మాట్లాడితే, టీమిండియా తరపున టీ20ల్లో గొప్పగా బౌలింగ్ చేసే వారు ఎందరో ఉన్నారు’ అని తెలిపారు.
మహ్మద్ షమీ టీ20 ఫార్మాట్ బౌలర్ కాదు: మంజ్రేకర్
మహ్మద్ షమీపై సంజయ్ మంజ్రేకర్ విరుచుకపడ్డాడు. ‘మనం షమీని చాలా ఏళ్లుగా చూస్తున్నాం. టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్. నేను అతని టీ20 ఎకానమీ రేటును చివరిసారి చూసినప్పుడు కేవలం 9 గా ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌పై అతను బాగా బౌలింగ్ చేశాడని నాకు తెలుసు. కానీ, టీమ్ ఇండియాలో షమీ కంటే మెరుగైన టీ20 బౌలర్లు ఉన్నారు’ అని తెలిపారు.
టీ20 ఇంటర్నేషనల్‌లో మహ్మద్ షమీ గణాంకాలు చాలా దారుణంగా ఉన్నాయి. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ 15 మ్యాచ్‌లలో 15 వికెట్లు పడగొట్టాడు. ఇందులో షమీ ఎకానమీ రేట్ ఓవర్‌కు 9.79 పరుగులు. టీ20 ఫార్మాట్‌లో ఇది చాలా ఎక్కువ. ప్రస్తుతం షమీ మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ.. అతను ఐపీఎల్ 2021 రెండవ దశలో పంజాబ్ తరపున బాగా ఆడాడు. వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 3 వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్‌పై షమీ 43 పరుగులు చేసినప్పటికీ, ఆ తర్వాత సోషల్ మీడియాలో అతనిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. టీమ్ ఇండియా ఇప్పుడు స్కాట్లాండ్‌తో తలపడుతుందని, భారత ప్లేయింగ్ XIలో ఎలాంటి మార్పు ఉండదని భావిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో షమీ మరోసారి తన సత్తా చూపించడంలో నిమగ్నమయ్యాడు.