T20 World Cup 2021: టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో టీమ్ ఇండియా..! ఈ 4 కారణాల వల్లే..?

|

Oct 28, 2021 | 9:12 AM

T20 World Cup 2021: 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ పేలవమైన ఆటతీరు కారణంగా ఇప్పుడు ప్రమాదంలో పడింది. పాకిస్థాన్ చేతిలో10 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు ఇప్పుడు

T20 World Cup 2021: టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో టీమ్ ఇండియా..! ఈ 4 కారణాల వల్లే..?
Ind Vs Nz
Follow us on

T20 World Cup 2021: 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ పేలవమైన ఆటతీరు కారణంగా ఇప్పుడు ప్రమాదంలో పడింది. పాకిస్థాన్ చేతిలో10 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు ఇప్పుడు సెమీఫైనల్ చేరడం చాలా కష్టమైన పని. టీమ్ ఇండియా ఆదివారం న్యూజిలాండ్‌తో మ్యాచ్ ఆడాలి అందులో కచ్చితంగా గెలవాలి. లేదంటే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించవచ్చు. టీమ్ ఇండియా ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్ విన్నర్‌లతో కూడా ఉంది. ఇదే పెద్ద ముప్పుగా పరిణమించింది. మరోవైపు టీమిండియా చాలా సమస్యలతో సతమతమవుతుంది. న్యూజిలాండ్ సద్వినియోగం చేసుకోగలిగే 4 బలహీనతలు ఉన్నాయి. వాటి గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడం..
భారత్ ప్లేయింగ్ XIలో చాలా మంది ఆటగాళ్లు ఫామ్‌లో లేరు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్‌ప్రీత్ బుమ్రా వంటి పెద్ద ఆటగాళ్లు టీమ్ ఇండియాలో ఉన్నారు. అయితే జట్టులోని కొంతమంది ఆటగాళ్లు మాత్రం ఫామ్‌లో లేరు. ఇది భారత జట్టును బలహీనపరుస్తుంది. సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లో లేడు. రోహిత్ శర్మ IPL 2021 నుంచి సరిగ్గా ఆడటం లేదు. హార్దిక్ పాండ్యా బ్యాట్‌తో రాణించడం లేదు. పంత్ కూడా గాడితప్పినట్లయింది.

ఆరో బౌలర్ లేకపోవడం..
బుధవారం హార్దిక్ పాండ్యా దుబాయ్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడని భారత జట్టుకు శుభవార్త వచ్చింది. అయితే అతను కివీ జట్టుపై బౌలింగ్ చేస్తాడా లేదా అనేది తెలియాలి. భారత జట్టులో ఇప్పటికీ ఆరో బౌలర్ లేడు. పాండ్యా బౌలింగ్ చేసినా ఎంత ప్రభావం చూపిస్తాడనేది తెలియడం లేదు.

టాస్‌కు బాస్‌గా మారాలి
టాస్ ఎవరి నియంత్రణలో లేదు కానీ విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌తో టాస్ ఓడిపోతే చాలా కష్టం. దుబాయ్‌లో మొదట బ్యాటింగ్ చేయడం కష్టంతో కూడుకున్నది. మంచు కారణంగా ఛేజింగ్ సులభం. ఇది పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రుజువైంది. న్యూజిలాండ్ జట్టు టాస్ గెలిస్తే వారు కూడా సెకండ్‌ బ్యాటింగ్‌కే మొగ్గు చూపుతారు.

భారత్‌పై న్యూజిలాండ్‌కు అద్భుతమైన రికార్డు
ఐసిసి టోర్నమెంట్‌లలో భారత్‌పై న్యూజిలాండ్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఐసీసీ టోర్నీలో గత 6 మ్యాచ్‌లు ఆడిన భారత్ కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే న్యూజిలాండ్‌ను ఓడించింది. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో 2003 ప్రపంచకప్‌లో ఈ విజయం సాధించింది. అప్పటి నుంచి 2007 T20 ప్రపంచ కప్, 2016 T20 ప్రపంచ కప్, 2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ , ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లలో భారతదేశం న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది.

Inspirational Video: ఈ చిన్నారికి కాళ్లు లేకపోయినా అందరి కళ్లను తన వైపు తిప్పుకుంటోంది..

Asaduddin Owaisi: పాక్ మంత్రి రషీద్ ఓ పిచ్చివాడు.. మా పెద్దలు పాకిస్థాన్ వెళ్లనందుకు మేము అదృష్టవంతులం అంటున్న ఒవైసీ

Hyderabad: ఒకే కాన్పులో నలుగురు పిల్లలు.. తల్లీబిడ్డలు క్షేమం..ఎక్కడంటే..