T20 World Cup 2021, NZ vs NAM: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా నేడు డబుల్ హెడర్స్‌లో భాగంగా తొలి మ్యాచులో నమీబియా వర్సెస్ న్యూజిలాండ్ టీంలు తలపడుతున్నాయి. వార్ వన్ సైడ్ అంటున్న చాలామందికి నమీబియా బౌలర్లు ఆదిలోనే రెండు వికెట్లు పడగొట్టి షాకిచ్చారు. ఫుల్ ఫాంలో ఉన్న మార్టిన్ గప్టిల్ వికెట్‌ను పడగొట్టి ఔరా అనిపించిన నమీడియా బౌలర్లు, ఆ వెంటనే మిచెల్‌ను కూడా పెవిలియన్ చేర్చారు. ఈ మ్యాచులో టాస్ గెలిచిన నమీబియా టీం తొలుత బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ఆరభంచిన కివీస్‌కు ఇన్నింగ్స్ 4.1 ఓవర్‌లో భారీ షాక్ తగిలింది. వైస్ వేసిన తొలి బంతిని మిడ్ ఆఫ్ మీదుగా బౌండరీ తరలించేందుకు ప్రయత్నంచాడు. కానీ, ట్రంపెల్‌మాన్ మిడ్-ఆఫ్‌లో సులభమైన క్యాచ్ తీసుకున్నాడు. దీంతో మార్టిన్ గప్టిల్ నమీబియాపై భారీ ఇన్నింగ్స్ ఆడకుండానే వెనుదిరిగాడు. ఈ మ్యాచులో గప్టిల్ 18(18 బంతులు, 1ఫోర్, 1 సిక్స్) పరుగులకు పెవిలియన్ చేరాడు.
6.2 ఓవర్లో మిచెల్ 19 పరుగులు(15 బంతులు, 2 ఫోర్లు), స్కోల్ట్జ్ బౌలింగ్‌లో స్వీపర్ కవర్‌లో భారీ షాట్ ఆడాడు. కానీ, వాన్ లింగేన్ అద్భుతంగా అందుకున్న క్యాచ్‌తో మిచెల్ పెవిలయ్ చేరాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ టీం 7 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. క్రీజులో కేన్ విలియమ్సన్ 6, డేవాన్ కాన్వే 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.