T20 World Cup 2021, AFG vs NZ: నవంబర్ 7 సాయంత్రం టీమిండియా మ్యాచ్ ఆడదు. అయినప్పటికీ భారత్ మొత్తం అబుదాబి వైపు చూస్తుంది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు ముఖాముఖిగా తలపడతాయి. భారత్ దృష్టిలో ఇది కేవలం మ్యాచ్ కాదు. కోహ్లీసేనను సెమీఫైనల్ చేర్చే దారి. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ టీం గెలవాలని భరాత్ కోరుకుంటుంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయం కారణంగా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి రాలేకపోయిన ముజీబ్‌ను ఆఫ్ఘనిస్తాన్ టీం కివీస్‌తో జరిగే మ్యాచులో ఆడించేందుకు ఛాన్స్ ఉంది. అశ్విన్ మొదట ఆఫ్ఘనిస్తాన్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అనంతరం తన మనసులోని మాటను బయటపెట్టాడు. ముజీబ్‌కు భారతీయ ఫిజియో నుంచి ఏదైనా సహాయం అందించగలిగితే నేను ఇష్టపడతానంటూ పేర్కొన్నాడు. కివీస్‌తో జరిగే మ్యాచ్‌కి ముందు అతడు ఫిట్‌గా ఉంటాడని భావిస్తున్నాం.
బ్రదర్ టెన్షన్ పడకు..!
అశ్విన్ ప్రతిపాదనకు ఆఫ్ఘనిస్థాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. బ్రదర్ టెన్షన్ పడకు. మా టీమ్ ఫిజియో ప్రశాంత్ పంచాడ చూస్తున్నారు’ అని సమాధానం ఇచ్చాడు.
న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘన్ మ్యాచ్‌పై భారత్ దృష్టి..
ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్‌పై భారీ విజయాలు నమోదు చేయడంతో భారత్ సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కానీ, ప్రస్తుతం భారత్ ఆశలన్నీ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌పై పడ్డాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే భారత్ ఆశలన్నీ అక్కడితో ముగిసిపోతాయి. కానీ, ఆఫ్ఘనిస్థాన్ గెలిస్తే మరుసటి రోజు నమీబియాతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి భారత్ సెమీస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.
స్కాట్లాండ్‌పై భారీ విజయం..
స్కాట్‌లాండ్‌పై 8 వికెట్ల భారీ విజయం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ కంటే భారత్ రన్-రేట్ మెరుగ్గా ఉంది. తొలుత 18వ ఓవర్‌లో స్కాట్‌లాండ్‌ను భారత్ కేవలం 85 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత మెరుగైన రన్ రేట్ కోసం 86 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 6.3 ఓవర్లలో అంటే 39 బంతుల్లోనే ఛేదించింది. కానీ రోహిత్-రాహుల్‌ల తుఫాను ఇన్నింగ్స్‌తో భారీ విజయం సాధించింది.
@ashwinravi99 Bhai Don’t worry our team Physio Prasanth Panchada “Chusukuntunnaru” ???
— Rashid Khan (@rashidkhan_19) November 4, 2021
Watch Video: రోహిత్, రాహుల్ బౌండరీలు, సిక్సర్ల వర్షం.. మ్యాచ్ హైలైట్స్ చూసేయండి