T20 World Cup 2021: 16 ఏళ్లకే క్యాన్సర్.. కార్పెంటర్, ప్లంబర్‌గా పని.. మాథ్యూ వేడ్ విజయం వెనుక దాగున్న కష్టాలు ఎన్నో..

|

Nov 14, 2021 | 8:13 AM

మాథ్యూ వేడ్ ఇప్పుడు ఇతని గురించి తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు. సెమీ ఫైనల్‎లో అతడు ఆడిన తీరు అందరిని ఆకట్టుకుంది. అతడి ఆటతో పాక్ చేతిలో ఉన్న మ్యాచ్ ఆసీస్ చేతిలోకి వెళ్లింది...

T20 World Cup 2021: 16 ఏళ్లకే క్యాన్సర్.. కార్పెంటర్, ప్లంబర్‌గా పని.. మాథ్యూ వేడ్ విజయం వెనుక దాగున్న కష్టాలు ఎన్నో..
Wed
Follow us on

మాథ్యూ వేడ్ ఇప్పుడు ఇతని గురించి తెలియని క్రికెట్ అభిమానులు ఉండరు. సెమీఫైనల్‎లో అతడు ఆడిన తీరు అందరిని ఆకట్టుకుంది. అతడి ఆటతో పాక్ చేతిలో ఉన్న మ్యాచ్ ఆసీస్ చేతిలోకి వెళ్లింది. గురువారం దుబాయ్‌లో జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో పాకిస్తాన్‌ బౌలర్ షాహీన్ షా అఫ్రిదీని బౌలింగ్‎లో మూడు సిక్సులు కొట్టి హీరో అయిన వేడ్ మ్యాచ్‎ను గెలిపించాడు. అయితే మాథ్యూ వేడ్ ఈ స్థాయిలోకి రావడానికి పడిన కష్టాల గురించి ఎవరికి తెలియదు.

మాథ్యూ వేడ్ 16 వయస్సులోనే చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. బతకడం కోసం ఎన్నో పాట్లు పడ్డాడు. వేడ్ కార్పెంటర్‎గా పని చేశాడు. ఎన్నో కష్టలకు ఓర్చి ఈ రోజు గొప్ప ఆటగాడిగా మారడు. వేడ్ 16 ఏళ్ల వయస్సులో ఫుట్ బాల్ ఆడుతున్నప్పుడు దెబ్బ తగిలింది. ఆ తర్వాత అతడు వైద్య పరీక్షలు చేయించుకోగా క్యాన్సర్ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. అంత చిన్న వయస్సులో వేడ్ క్యాన్సర్ రావడంతో అతను మానసికంగా ఇబ్బంది పడ్డాడు. ఆస్పత్రిలో చేరి కీమోథెరఫీతో చికిత్స తీసుకుంటునే శిక్షణ తీసుకున్నాడు వేడ్. అతను ఈ విషయాన్ని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో చెప్పాడు. కీమోథెరఫీ చికిత్స తీసుకుంటున్న అతడు బతకడానికి ప్లంబర్‌గా పని చేశాడు. అయితే చికిత్స సమయంలో శారీరకంగా బలహీనంగా ఉన్నానని, జుట్టు లేకుండా తొటి వాళ్లతో తిరగడానికి చాలా ఇబ్బంది పడ్డానని వేడ్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

మాథ్యూ వేడ్‌కు కలర్ బ్లైండ్ కూడా ఉండేది. అతను పింక్ బాల్‌తో డే అండ్ నైట్ క్రికెట్‌లో కలర్ బ్లైండ్ వల్ల సరిగా ఆడలేకపోయేవాడు. కొన్ని సమయాల్లో బాల్ ఎలా వస్తుందో కూడా తెలియకపోయేదని చెప్పాడు. 2018లో ఫామ్ కోల్పోయిన వేడ్ జాతీయ జట్టుకు దూరమైనప్పడు దాదాపు సంవత్సరం పాటు తన ఇంటిలోనే కార్పెంటర్‌గా పనిచేశాడు.” నేను వారానికి మూడు రోజులు కార్పెంటర్‌గా పని చేసాను. నా క్రికెట్‌ జీవితాన్ని కొంత కాలం పాటు కోల్పోయాను.” అని వేడ్ చెప్పాడు. మగాడి విజయం వెనుక ఆడవారు ఉంటారన్నట్టు మాథ్యూ వేడ్ విజయం వెనుక అతడి భార్య జూలియా ఉన్నారు. యాషెస్‌ సిరీస్‌కు ముందు అతడిని ఆస్ట్రేలియా- ఎ జట్టుకు ఎంపిక చేశారు. కాని అప్పుడే జూలియా ప్రెగ్నెంట్‎గా ఉంది. వేడ్ తనకు ఈ పర్యటనకు వెళ్లడం ఇష్టం లేదని సెలెక్టర్లకు చెబుతానని భార్యకు ఫోన్ చేశాడు. కానీ ఆమె మీరు ఇంగ్లాండ్ టూర్‎కు వెళ్లాలని ఆమె మాథ్యూ వేడ్‎ను ఓప్పించారు. పాకిస్తాన్‎తో జరిగిన సెమీఫైనల్లో మాథ్యు వేడ్ 17 బంతుల్లో 41 పరుగులు చేశాడు.

Read Also.. AUS vs NZ Final: నేడే టీ20 ప్రపంచకప్ ఫైనల్.. తుది పోరులో తలపడనున్న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఎవరి బలం ఎంతంటే?