Ishan Kishan: టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనే జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఎంపికైన సంగతి విదితమే. శిఖర్ ధావన్, పృథ్వీ షాల స్థానంలో మూడవ ఓపెనర్‌గా ఎంచుకున్నారు. ఐపీఎల్ 2021లో పాల్గొనేందుకు ఇషాన్ కిషన్ దుబాయ్‌లో వెళ్లాడు. ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగుతున్న ఈ యంగ్ బ్యాట్స్‌మెన్ ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. అయితే నిన్న బీసీసీఐ టీ20 ప్రపంచ కప్ జట్టును ప్రకటించగానే ఈ యువ బ్యాట్స్‌మెన్ భావోద్వేగానికి లోనయ్యాడు. ముంబై టీంలోని సహచరుడు హార్దిక్ పాండ్యా వచ్చి కంగ్రాట్స్ చెప్పాడు. ఇంతలోనే బాగా ఎమోషనల్ అయిన ఇషాన్.. హార్దిక్‌కు హగ్ ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్త పరిచాడు. అలాగే మిగతా జట్టు సభ్యులు కూడా ఈ యంగ్ ఓపెనర్‌ను అభినందించారు. ఈమేరకు ముంబై ఇండియన్స్ టీం తన సోషల్ మీడియాలో ఈ వీడియోను పంచుకుంది.
” టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించగానే ముంబై టీం వాతావరణం మొత్తం మారిపోయింది. హగ్స్, నవ్వులు, ఉద్వేగంతో నిండిపోయింది. టీ20 ప్రపంచ కప్ జట్టుకు ఎంపికైన సూర్యకుమార్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రాహుల్ చాహర్ లాంటి ఆటగాళ్లకు మా అభినందనలు” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టును షేర్ చేసింది. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో అర్థ సెంచరీ చేసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
Also Read:
CPL: చెత్త ఫీల్డింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లు వీరేనేమో.. కామెంట్లతో ఏకిపారేస్తోన్న నెటిజన్లు