Ravi Shastri: పెట్రోల్‌తో వాహనాలను నడపొచ్చు.. మనుషులను కాదు: బీసీసీఐపై రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు

|

Nov 09, 2021 | 8:56 AM

భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, కోచ్‌గా రవిశాస్త్రి శకం నిన్నటి నమీబియా మ్యాచ్‌తో ముగిసింది. ఆదివారం అఫ్గానిస్థాన్‌ ఓటమితో సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న భారత జట్టు ఆశలు అడియాసలయ్యాయి.

Ravi Shastri: పెట్రోల్‌తో వాహనాలను నడపొచ్చు.. మనుషులను కాదు: బీసీసీఐపై రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు
Ravi Shastri
Follow us on

Ravi Shastri vs BCCI: భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, కోచ్‌గా రవిశాస్త్రి శకం నిన్నటి నమీబియా మ్యాచ్‌తో ముగిసింది. ఆదివారం అఫ్గానిస్థాన్‌ ఓటమితో సెమీఫైనల్‌కు చేరుకోవాలన్న భారత జట్టు ఆశలు అడియాసలయ్యాయి. అందువల్ల నమీబియాతో జరిగే మ్యాచ్ ఫలితం టోర్నీపై ఎలాంటి ప్రభావం చూపకపోగా, ఈ చివరి మ్యాచ్‌‌తో భారత్ ప్రయాణం కూడా ముగిసిపోయింది.

కెప్టెన్‌గా ఈ టోర్నీ తనకు చివరి టీ20 అసైన్‌మెంట్ అని విరాట్ కోహ్లీ ఇప్పటికే ప్రకటించాడు. అదే సమయంలో కోచ్ రవిశాస్త్రి ప్రతి ఫార్మాట్‌లో తన పదవిని వదులుకుంటున్నాడు. మ్యాచ్‌కు ముందు స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన రవిశాస్త్రి తన పదవీకాలం గురించి మట్లాడాడు.

టీ20లో భారత పేలవ ప్రదర్శనకు కారణాల గురించి రవిశాస్త్రి మాట్లాడుతూ.. ఆటగాళ్లు కేవలం మనుషులు మాత్రమే యంత్రాలు కాదు. పెట్రోల్‌ పోసి మెషిన్‌ను నడపవచ్చు, కానీ వీరంతా మనుషులే, యంత్రాలు కాదు. దాదాపు 6 నెలల నుంచి బయో బబుల్‌లో ఉన్నారు. నిరంతరం క్రికెట్ ఆడుతున్నారు. ప్రపంచకప్‌కు ఏటీం అయినా తాజాగా ఉండాలని కోరుకుంటుంది. కానీ, భారత ఆటగాళ్ల విషయంలో అలా జరగలేదు. టోర్నీని షెడ్యూల్ చేయడానికి ముందు ఐసీసీ ఈ ఆలోచన చేసి ఉండాల్సింది’ అని ఆగ్రహించారు.

“గత ఐదేళ్లలో మేం అద్భుతమైన క్రికెట్‌ ఆడామని రవిశాస్త్రి తెలిపాడు. 70 ఏళ్లలో ఏ ఆసియా జట్టు కూడా ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలవలేదు. అక్కడ రెండుసార్లు సిరీస్‌ గెలిచాం. మనం చేసింది ఎవరూ చేయలేకపోయారు. ఆస్ట్రేలియాలో గెలిచాం, ఇంగ్లండ్‌లో గెలిచాం, దక్షిణాఫ్రికాలో గెలిచాం. ఈ బృందం చాలా దూరం వెళ్తుందని” ఆయన తెలిపారు.

రవిశాస్త్రి 2017లో టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా మారాడు. అతని కోచింగ్‌లో, భారత జట్టు 2019 వన్డే ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌కు, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు ప్రయాణించింది. శాస్త్రి హయాంలో ఆస్ట్రేలియన్ గడ్డపై వరుసగా రెండు సార్లు టెస్టులు గెలిచిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది.

Also Read: Ravi Shastri-Virat Kohli: ముగిసిన కోహ్లీ – రవిశాస్త్రిల శకం.. వీరిద్దరు చేసిన 5 తప్పులకు టీమిండియా ఆటగాళ్లు బలి.. అవేంటంటే?

India New Captain: టీమిండియా నూతన సారథి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానమిచ్చిన విరాట్ కోహ్లీ.. ఎవరి పేరు చెప్పాడంటే?