T20 World Cup 2021, AFG Vs PAK: ఆ సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకోండి: ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లకు తాలిబన్ల ఆదేశాలు

|

Oct 29, 2021 | 3:59 PM

ప్రస్తుతం ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు నేడు పాకిస్తాన్‌తో తొలిసారి తలపడనుంది. అంతకుముందు సోమవారం స్కాట్లాండ్‌తో పోటీ పడి విజయం సాధించింది.

T20 World Cup 2021, AFG Vs PAK: ఆ సమయంలో భావోద్వేగాలను నియంత్రించుకోండి: ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లకు తాలిబన్ల ఆదేశాలు
T20 World Cup 2021, PAK vs NAM
Follow us on

T20 World Cup 2021, AFG Vs PAK: ప్రస్తుతం ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు నేడు పాకిస్తాన్‌తో తొలిసారి తలపడనుంది. అంతకుముందు సోమవారం స్కాట్లాండ్‌తో పోటీ పడి విజయం సాధించింది. అయితే షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు ముందు ఆఫ్ఘనిస్తాన్ జాతీయ గీతం ఆలపించిన సమయంలో ఈ దేశ ఆటగాళ్ల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ ఘటన తర్వాత ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టుపై తాలిబాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందా? గురువారం పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితితోపాటు టీ20 ప్రపంచకప్‌లో ఆడటం గురించి రషీద్ ఖాన్‌ మాట్లాడాడు.

తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రషీద్, సూపర్-12లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు సాఫ్ట్‌గా మాట్లాడాడు. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం, జాతీయ గీతం వినిపించినప్పుడు జట్టు ఆటగాళ్లు ఏడ్చిన తర్వాత తాలిబాన్ ప్రభుత్వం ఆటగాళ్లను సంప్రదించినట్లు తెలిసింది. తాలిబాన్ వచ్చిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ జెండా కూడా మారిపోయింది. ప్రస్తుతం నలుపు, తెలుపు రంగులో ఉంది. అలాగే దేశంలో జాతీయ గీతాన్ని నిషేధించారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌ మైదానంలో జెండాను ఎగురవేసినప్పుడు లేదా జాతీయ గీతం ఆలపించినప్పుడు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లకు స్పష్టంగా చెప్పారు. బుధవారం సాయంత్రం ఆటగాళ్లు సమావేశమై తాలిబన్ ప్రభుత్వం చెప్పేది పాటించాలని, క్రికెట్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు కూడా తెలిసింది. అందువల్ల, టోర్నమెంట్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు దౌత్యపరంగా ఉంటే ఆశ్చర్యపోనవసరం లేదు.

ప్రపంచకప్‌లో ఆడటం గురించి రషీద్‌ను అడిగినప్పుడు, “ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఇంట్లో కూడా అంతా మామూలే. భవిష్యత్తులో కూడా అంతా సవ్యంగా సాగుతుందని ఆశిద్దాం. క్రికెట్ ఆడేందుకు జట్టుగా ఇక్కడికి వచ్చాం. ఇది ఆటగాళ్లుగా మా చేతుల్లో ఉన్న విషయం. టోర్నీ అంతటా ఇదే విధంగా చేసేందుకు ప్రయత్నిస్తాం. వాళ్లు ఎంజాయ్ చేసేలా, సెలబ్రేట్ చేసుకునేలా ప్రదర్శన ఇస్తాం. ఇది ఒక జట్టుగా మా ప్రణాళిక, ప్రతిదీ సరిగ్గా జరుగుతుందని ఆశిస్తున్నాం” అని తెలిపాడు.

జట్టు భవిష్యత్తుపై ఏమన్నాడంటే..
తాలిబన్ల రాకతో ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళల క్రికెట్‌పై నిషేధం విధించారు. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత తన దేశాన్ని రక్షించాలని ప్రపంచ నాయకులకు విజ్ఞప్తి చేసిన ఆటగాడు రషీద్. అఫ్గానిస్థాన్ కొత్త ప్రభుత్వం మహిళల క్రికెట్ జట్టును ఆమోదించకపోతే, పురుషుల జట్టుతో హోబర్ట్‌లో జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేస్తామని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఐసీసీ నిబంధనల ప్రకారం, ఒక దేశం మహిళా క్రికెట్ జట్టు పూర్తి సభ్య హోదాను పొందేందుకు వీలవుతుంది.

ప్రపంచ క్రికెట్‌లో ఆఫ్ఘనిస్థాన్ భవిష్యత్తు గురించి రషీద్‌ను అడిగినప్పుడు, “నిజాయితీగా చెప్పాలంటే, ప్రస్తుతానికి మా మనస్సులో ఏమీ లేదు. ప్రపంచకప్ ఆడేందుకు ఇక్కడికి వచ్చామనే ఒక్కటే ఇప్పుడు మా మనసులో ఉంది. మేము ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో మూడు గెలవాలి. ఇది మన చేతుల్లో లేదు. మన నియంత్రణలో లేదు. దాని గురించి మనం ఆలోచించకూడదు. భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఆలోచించడం లేదు. దీంతో జట్టు ప్రదర్శనలో మార్పు రావచ్చు. మేం రాణించకపోతే అభిమానులు కూడా నిరాశ చెందుతారు’’ అని అన్నారు.

Also Read: WI vs BAN, T20 World Cup 2021: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఈసారైనా అచ్చొచ్చేనా..? ప్లేయింగ్ XIలో ఎవరున్నారంటే..!

French Open 2021: క్వార్టర్ ఫైనల్ చేరిన పీవీ సింధు.. పురుషుల డబుల్స్‌ జోడీ కూడా..!