Syed Mushtaq Ali Trophy 2021: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్ సిద్దమైంది. అన్ని మ్యాచ్‌లు దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్నాయి. అయితే ప్రస్తుతం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నాకౌట్ మ్యాచ్‌ల నిర్వహణపై ప్రస్తుతం ప్రశ్నలు తలెత్తడానికి కారణం కూడా ఇదే. ఢిల్లీ విషపూరిత గాలిలో క్రికెట్ ఎలా ఆడతారంటూ ప్రజలు పదే పదే అడుగుతున్నారు. దీపావళి రోజున పటాకులు పేలడంతో ఢిల్లీ వాతావరణం మొత్తం అతలాకుతలమైంది. రాబోయే రోజుల్లో రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లో పరిస్థితి మరింత దిగజారుతుందని AQI అంచనా వేసే ఏజెన్సీ పేర్కొంది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నాకౌట్ మ్యాచ్‌లు నవంబర్ 16 నుంచి జరగనున్నాయి. కాగా ఫైనల్ మ్యాచ్ నవంబర్ 22న జరగనుంది. IPL 2022 మెగా వేలానికి ముందు, నాకౌట్ మ్యాచ్ కూడా ఆటగాళ్లకు వారి స్వంత ప్రదర్శనతో ఫ్రాంచైజీల హృదయాలను గెలుచుకోవడానికి ఇదే చివరి అవకాశంగా నిలిచింది. అయితే ఢిల్లీలోని కలుషిత వాతావరణంలో క్రికెట్ ఎలా ఆడాలి అనేది పెద్ద ప్రశ్న. అయితే గాలి కాలుష్యం కారణంగా, ఢిల్లీ ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రభ్యుత్వం కూడా పేర్కొంది.
నాకౌట్ దశలో మొత్తం 10 మ్యాచ్‌లు..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నాకౌట్ దశలో 3 ప్రీక్వార్టర్ ఫైనల్స్, 4 క్వార్టర్ ఫైనల్స్, 2 సెమీ-ఫైనల్, 1 ఫైనల్ సహా మొత్తం 10 మ్యాచ్‌లు జరుగుతాయి. నాకౌట్‌లో తొలి మ్యాచ్ మహారాష్ట్ర, విదర్భల మధ్య ప్రీక్వార్టర్‌ఫైనల్ రూపంలో జరగనుంది. రెండో ప్రీక్వార్టర్ ఫైనల్ హిమాచల్‌ప్రదేశ్, కేరళ మధ్య జరగనుంది. కాగా మూడో ప్రీక్వార్టర్ ఫైనల్ కర్ణాటక, సౌరాష్ట్ర మధ్య జరగనుంది. ఈ మూడు మ్యాచ్‌లు నవంబర్ 16న జరగనున్నాయి.
నవంబర్ 18 నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు..
ప్రిక్వార్టర్ ఫైనల్స్ ముగిసిన తర్వాత ఒకరోజు విరామం ఉంది. ఆ తర్వాత నవంబర్ 18 నుంచి టోర్నీ క్వార్టర్ ఫైనల్స్ జరగనుండగా, ఇందులో ప్రిక్వార్టర్ ఫైనల్ నుంచి క్వార్టర్ ఫైనల్‌కు వెళ్లే 3 జట్లు పాల్గొంటాయి. అలాగే బెంగాల్, గుజరాత్, హైదరాబాద్ జట్లు కూడా పాల్గొననున్నాయి. టోర్నీలో రెండో క్వార్టర్ ఫైనల్ లైనప్ సిద్ధంగా ఉంది. ఇందులో గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ జట్లు నవంబర్ 18 మధ్యాహ్నం 1 గంటలకు పోటీపడనున్నాయి.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రెండు సెమీ ఫైనల్‌లు నవంబర్ 20న జరగనున్నాయి. తొలి సెమీఫైనల్ ఉదయం 8.30 గంటలకు, రెండో సెమీఫైనల్ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమవుతుంది. దీని తర్వాత నవంబర్ 21న విరామం ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ 22న టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
T20 World Cup 2021 Final: ఆసక్తికరంగా పొరుగు దేశాల మధ్య పోరు.. తొలి విజేతగా నిలిచేది ఎవరో?