Suryakumar Yadav : ఒమన్ మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ సంచలనం.. పేరు చెప్పకుండానే పాకిస్తాన్‌కు గట్టి సమాధానం

ఆసియా కప్ 2025లో ఒమన్తో జరిగిన గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్, గెలిచిన తర్వాత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సూపర్-4లో పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ గురించి అడిగినప్పుడు, సూర్యకుమార్ ఆ జట్టు పేరును నేరుగా ప్రస్తావించకుండానే సమాధానం చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Suryakumar Yadav : ఒమన్ మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ సంచలనం.. పేరు చెప్పకుండానే పాకిస్తాన్‌కు గట్టి సమాధానం
India Vs Oman Asia Cup

Updated on: Sep 20, 2025 | 4:41 PM

Suryakumar Yadav : ఆసియా కప్ 2025లో ఒమన్తో జరిగిన గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్, గెలిచిన తర్వాత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సూపర్-4లో పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ గురించి అడిగినప్పుడు, సూర్యకుమార్ ఆ జట్టు పేరును నేరుగా ప్రస్తావించకుండానే సమాధానం చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆసియా కప్ 2025లో ఒమన్తో జరిగిన గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్‌లో భారత్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఇప్పటికే సూపర్-4కు అర్హత సాధించడంతో, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బెంచ్ ప్లేయర్లకు అవకాశం కల్పించారు. సూర్యకుమార్ తాను బ్యాటింగ్‌కు దిగకుండానే జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్ తర్వాత అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

సూపర్-4లో మొదటి మ్యాచ్ పాకిస్తాన్‌తో ఆడబోతున్నందుకు భారత జట్టు సిద్ధంగా ఉందా అని సూర్యకుమార్‌ను అడిగినప్పుడు, అతను నేరుగా పాకిస్తాన్ పేరు చెప్పకుండా, ‘మేము సూపర్-4 ఆడటానికి రెడీగా ఉన్నాం’ అని మాత్రమే చెప్పాడు. అతని ఈ సమాధానం అభిమానులు, నిపుణులను ఆశ్చర్యపరిచింది. ఇది వ్యూహాత్మకంగా చేసిన వ్యాఖ్య అని కొందరు భావించగా, మరికొందరు సూర్యకుమార్ ప్రత్యర్థికి అనవసరమైన ప్రాధాన్యత ఇవ్వదలచుకోలేదని అభిప్రాయపడ్డారు.

మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఓమన్ జట్టు ఆటతీరును ప్రశంసించాడు. ‘ఒమన్ చాలా అద్భుతంగా ఆడింది. వారి కోచ్ సులక్షణ్ కులకర్ణి ఆధ్వర్యంలో వారి సన్నాహాలు పటిష్టంగా ఉంటాయని నాకు తెలుసు. వారి బ్యాటింగ్ చూడటం చాలా ఆనందంగా ఉంది’ అని సూర్య అన్నాడు.

అలాగే, తన జట్టులోని ఆటగాళ్ల గురించి కూడా మాట్లాడాడు. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా వంటి బౌలర్లు ఇంత కాలం తర్వాత, అబుదాబిలోని వాతావరణంలో బౌలింగ్ చేయడం కష్టమని సూర్యకుమార్ అన్నాడు. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌లో పెద్దగా రాణించకపోయినా, అతని ఉనికి జట్టుకు చాలా ముఖ్యమని ప్రశంసించాడు.

భారత్ ఇప్పుడు సూపర్-4లో మూడు కీలక మ్యాచ్‌లు ఆడనుంది. మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 21న పాకిస్తాన్‌తో, రెండో మ్యాచ్ సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్‌తో, చివరి మ్యాచ్ సెప్టెంబర్ 26న శ్రీలంకతో జరగనుంది. శ్రీలంక గ్రూప్ స్టేజ్‌లో అజేయంగా నిలవడంతో ఆ మ్యాచ్ కూడా చాలా సవాలుగా ఉంటుందని భావిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..