దక్షిణాఫ్రికాలో టీ20 సిరీస్‌ను సమం చేసిన టీమిండియా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు టెస్టు సిరీస్ లోనూ చారిత్రాత్మక విజయం సొంతమైతే ఈ సఫారీ టూర్ పూర్తిగా సక్సెస్ అయినట్లే. అయితే ఈ ఆనందకరమైన విషయాల మధ్య టీమిండియాకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇది భారత క్రికెట్ అభిమానులకు తీవ్ర ఆందోళన కలగజేస్తోంది. అదేంటంటే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్ కొన్ని వారాల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో సూర్య కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సూర్య కాలు బెణకడంతో మిస్టర్ 360 వెంటనే మైదానాన్ని వీడాడు. అయితే చివరి టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత గాయం ప్రభావం పెద్దగా కనిపించలేదు. నడకలోనూ అతనికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అయితే స్వదేశానికి వచ్చిన తర్వాత సూర్య స్కానింగ్ చేయించుకున్నాడు. అందులో గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తేలింది. ప్రస్తుతానికి మిస్టర్ 360 కొన్ని రోజుల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలని, పూర్తి విశ్రాంతి అవసరసమని తెలుస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం..సూర్యకుమార్ దాదాపు 7 వారాల పాటు క్రికెట్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా జనవరిలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సూర్య కుమార్ దూరం కానున్నాడు. ప్రస్తుతం అతను బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడని, అక్కడే కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకుంటాడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఒకవేళ సూర్య కుమార్ క్రికెట్ కు దూరమైతే బీసీసీఐ, సెలక్షన్ కమిటీ ముందు పెద్ద ప్రశ్నే ఎదురవుతుంది. ఎందుకంటే గత ఏడాది కాలంగా జట్టును నడిపిస్తున్న స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా గాయం కారణంగా క్రికెట్‌కు దూరమయ్యాడు. సూర్య కూడా దూరమైతే అఫ్గానిస్థాన్‌తో జరిగే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. మరి బీసీసీఐ వేరొకరికి కెప్టెన్సీ ఇస్తుందా లేక రోహిత్ శర్మను వెనక్కి తీసుకుంటుందా అనేది చూడాలి. జనవరి 7న భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ముగియనున్నందున ఇది అంత సులభం కాదు. జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్ తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ విషయంలో సెలక్టర్లకు కూడా పెద్ద తలనొప్పి వచ్చింది.
सूर्या दादा, wishing you a very speedy & strong recovery! 🤞
Can’t wait to see you back on the field & we will be right here cheering for you! 💙#OneFamily #MumbaiIndians pic.twitter.com/r9gwmVGx45
— Mumbai Indians (@mipaltan) December 23, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..