
భారత క్రికెట్ చరిత్రలో 2024, 2026 టీ20 ప్రపంచ కప్ విజయాలు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవి. 2024లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పితే, 2026లో ఇషాన్ కిషన్ తన వ్యక్తిగత విషాదాన్ని దిగమింగుకుని పట్టిన క్యాచ్‌లు భారత్‌ను మళ్ళీ విశ్వవిజేతగా నిలబెట్టాయి.
2024 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమమైనదిగా నిలిచిపోయింది. చివరి ఓవర్‌లో డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద సూర్య పట్టుకుని, బ్యాలెన్స్ తప్పడంతో గాలిలోకి విసిరి, మళ్ళీ లోపలికి వచ్చి పట్టుకున్న తీరు అద్భుతం. ఈ ఒక్క క్యాచ్‌తో భారత్ 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కప్పు గెలుచుకుంది.
2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో ఇషాన్ కిషన్ హీరోగా నిలిచారు. మ్యాచ్‌కు రెండు రోజుల ముందే తన సోదరిని కోల్పోయిన ఇషాన్, ఆ బాధను గుండెల్లో దాచుకుని మైదానంలోకి దిగారు. బుమ్రా బౌలింగ్‌లో రచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్‌ను డైవ్ చేస్తూ పట్టుకున్న తీరు టీమ్ ఇండియాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అలాగే బౌండరీ లైన్ వద్ద టిమ్ సీఫెర్ట్ క్యాచ్‌ను జుగుల్ చేస్తూ పట్టుకుని కివీస్ ఆశలను ఆవిరి చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..