ICC T20 Rankings: ఆకాశమే హద్దుగా.. టీ20 ర్యాంకింగ్స్‌లో అందనంత ఎత్తులో మిస్టర్‌ 360 ప్లేయర్‌.. రేటింగ్‌లో ఏకంగా..

అభిమానులు ముద్దుగా sky అని పిలుచుకునే మన థండర్‌ బోల్ట్‌.. ఈ ఏడాది ఆకాశమే హద్దుగా చెలరేగి బ్యాటింగ్‌ చేస్తున్నాడు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్‌ చార్ట్‌లో టాప్‌లో నిలిచాడు. నిలవడమే కాదు.. మ్యాచ్‌ మ్యాచ్‌కీ తన రేటింగ్‌ పాయింట్లను పెంచుకుంటూ వెళ్తున్నాడు.

ICC T20 Rankings: ఆకాశమే హద్దుగా.. టీ20 ర్యాంకింగ్స్‌లో అందనంత ఎత్తులో మిస్టర్‌ 360 ప్లేయర్‌.. రేటింగ్‌లో ఏకంగా..
Suryakumar Yadav

Updated on: Nov 24, 2022 | 7:38 AM

టీమిండియా వరుసగా రెండు టీ20 వరల్డ్‌కప్స్‌లో ఓడిపోయి ఉండొచ్చు.. ఆసియా కప్‌లో చేతులెత్తేయొచ్చు.. కానీ అభిమానులకు రియల్‌ క్రికెట్‌ ఫీస్ట్‌ అందిస్తున్నాడు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. 360 డిగ్రీల బ్యాటింగ్‌తో యంగ్‌ ఎక్స్‌ప్లోజివ్‌గా టీమిండియాలో నిలిచాడు. అభిమానులు ముద్దుగా sky అని పిలుచుకునే మన థండర్‌ బోల్ట్‌.. ఈ ఏడాది ఆకాశమే హద్దుగా చెలరేగి బ్యాటింగ్‌ చేస్తున్నాడు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్‌ చార్ట్‌లో టాప్‌లో నిలిచాడు. నిలవడమే కాదు.. మ్యాచ్‌ మ్యాచ్‌కీ తన రేటింగ్‌ పాయింట్లను పెంచుకుంటూ వెళ్తున్నాడు. కివీస్‌ టూర్‌ రెండో టీ20లో వీర విహారం చేసి.. మెరుపు సెంచరీ నమోదు చేశాడు స్కై. ఆ ఇన్నింగ్స్‌ వరల్డ్‌ వైడ్‌గా అభిమానులను ఆకట్టుకుంది. అంతెందుకు ప్రత్యర్థులనే కట్టిపడేసింది. అందుకే కివీస్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌.. ఇలాంటి ఇన్నింగ్స్‌ మునుపెన్నడూ చూడలేదని కితాబిచ్చాడు. అటు ర్యాంకింగ్స్‌లో ఏకంగా 890 పాయింట్లను సాధించి నెంబర్‌ వన్‌ స్థానాన్ని మరింత పటిష్టపరుచుకున్నాడు. ఇక రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌కు 836 పాయింట్లు ఉన్నాయి. తొలి రెండు స్థానాల్లో ఉన్న సూర్యకుమార్‌, రిజ్వాన్‌ల మధ్య వ్యత్యాసం 54 పాయింట్లుగా ఉంది

అయితే టాప్‌-10లో మరో భారత ప్లేయరే లేకపోవడం ఫ్యాన్స్‌ని హర్ట్‌ చేస్తోంది. విరాట్‌ కోహ్లీ 13వ స్థానంలో నిలిచాడు. KL రాహుల్‌ 19వ ర్యాంక్‌కి పడిపోయాడు. మరోవైపు ఆల్‌టైమ్‌ హయ్యెస్ట్‌ రేటింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ కోహ్లీ 597 పాయింట్లతో మూడో ప్లేస్‌లో నిలిచాడు. సూర్య జోరు చూస్తుంటే.. డేవిడ్‌ మలాన్‌ రేటింగ్‌ 915ని ఈజీగా దాటేసే అవకాశం ఉందని అభిమానులు అంటున్నారు. ఇక టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలో ఉంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-0తో భారత జట్టు కైవసం చేసుకుంది. శుక్రవారం (నవంబర్‌25) నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోనూ సత్తా చాటాలని సూర్య ఉవ్విళ్లూరుతున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..