SRH vs LSG IPL Match Result: మన్కడ్, పూరన్‌ల దెబ్బకు లీగ్ నుంచి హైదరాబాద్ ఔట్.. ప్లేఆఫ్స్ చేరువలో లక్నో..

|

May 13, 2023 | 7:20 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 58వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్‌ ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ అందించిన 183 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా చేరుకుంది.

SRH vs LSG IPL Match Result: మన్కడ్, పూరన్‌ల దెబ్బకు లీగ్ నుంచి హైదరాబాద్ ఔట్.. ప్లేఆఫ్స్ చేరువలో లక్నో..
Srh Vs Lsg Result
Follow us on

Sunrisers Hyderabad vs Lucknow Super Giants: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై లక్నో సూపర్‌జెయింట్స్ వరుసగా మూడో విజయం సాధించింది. హైదరాబాద్‌పై ఆ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో లక్నో ప్లేఆఫ్‌కు రేసులో నిలిచింది. లక్నో జట్టు ఖాతాలో 13 పాయింట్లు ఉన్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 183 పరుగుల లక్ష్యాన్ని లక్నో బ్యాట్స్‌మెన్ 19.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఛేదించారు. మన్కడ్ తన కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ చేశాడు. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మార్కస్ స్టోయినిస్ 40 పరుగుల వద్ద అవుటయ్యాడు. క్వింటన్ డికాక్ 29 పరుగుల వద్ద అవుటయ్యాడు. అంతకుముందు కైల్ మేయర్స్ (2 పరుగులు) పెవిలియన్ చేరాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ 47 పరుగులతో రాణించగా, అబ్దుల్ సమద్ 37 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరగగా, ఓపెనర్ అన్మోల్‌ప్రీత్ 36 పరుగులు చేశాడు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా రెండు వికెట్లు తీయగా, యుధ్వీర్, అవేష్ ఖాన్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా తలో వికెట్ తీశారు.

ఇరు జట్లు:

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(కీపర్), కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్ చరక్, అవేష్ ఖాన్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్ (కీపర్), హెన్రిచ్ క్లాసెన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హాక్ ఫరూఖీ.