IPL 2025: ఆ నలుగురిపై కన్నేసిన కావ్య మారన్.. ఎంత ఖర్చయినా సరే రిటైన్ చేయాల్సిందే..

|

Sep 12, 2024 | 8:56 PM

Sunrisers Hyderabad IPL Retentions: ఐపీఎల్ 2025కి సంబంధించిన చర్చలు మరింత ముదిరాయి. రిటెన్షన్‌కు సంబంధించి బీసీసీఐ కొత్త నిబంధనలను ఇంకా విడుదల చేయలేదు. ఆగస్టు నెలాఖరులోగా ఈ విషయాన్ని బోర్డు అందరికీ తెలియజేస్తుందని భావించినా సెప్టెంబర్ సగం కావస్తోన్న కూడా నిబంధనలు బయటకు రాలేదు. IPL జట్లు తమ సొంత ప్రణాళికలను సిద్ధం చేసుకుంటాయి.

IPL 2025: ఆ నలుగురిపై కన్నేసిన కావ్య మారన్.. ఎంత ఖర్చయినా సరే రిటైన్ చేయాల్సిందే..
Srh Ipl 2025 Kavya Maran
Follow us on

Sunrisers Hyderabad IPL Retentions: ఐపీఎల్ 2025కి సంబంధించిన చర్చలు మరింత ముదిరాయి. రిటెన్షన్‌కు సంబంధించి బీసీసీఐ కొత్త నిబంధనలను ఇంకా విడుదల చేయలేదు. ఆగస్టు నెలాఖరులోగా ఈ విషయాన్ని బోర్డు అందరికీ తెలియజేస్తుందని భావించినా సెప్టెంబర్ సగం కావస్తోన్న కూడా నిబంధనలు బయటకు రాలేదు. IPL జట్లు తమ సొంత ప్రణాళికలను సిద్ధం చేసుకుంటాయి. ఈ మెగా వేలానికి ముందు అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాలను తయారు చేస్తున్నాయి. క్రికెట్ నిపుణులు కూడా రిటెన్షన్‌పై ఊహాగానాలు చేస్తున్నారు.

కావ్య మారన్‌కి ఎక్కువైన కష్టాలు..

ఐపీఎల్ 2024లో ఫైనల్‌కు చేరనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపైనే అందరి దృష్టి ఉంది. ఈ జట్టులో ఒకటి కంటే ఎక్కువ డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు. ఎవరిని రిటెన్షన్ చేయలి, ఎవరిని రిలీజ్ చేయాలనే ఆందోళనతో సతమతవుతోంది. హైదరాబాద్‌లో కెప్టెన్ పాట్ కమిన్స్‌తో పాటు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్‌రామ్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. దీంతో టీమ్ ఓనర్ కావ్య మారన్‌కు ఇబ్బందులు ఎక్కువయ్యాయి.

ఆకాశ్ చోప్రా సూచించిన నలుగురు..

సన్‌రైజర్స్‌ రిటైన్ చేసుకునే ఆటగాళ్లపై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పుకొచ్చాడు. సన్‌రైజర్స్ తన కెప్టెన్ క్లాసెన్‌తో తన ఓపెనింగ్ జోడీని రిటైన్ చేసుకుంటుందని చోప్రా చెప్పుకొచ్చాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పందిస్తూ, “SRH ట్రావిస్ హెడ్, పాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మలను కొనసాగిస్తుంది. ఈ నలుగురిని హైదరాబాద్ జట్టు ఎక్కడికీ వెళ్లనివ్వదు. కాబట్టి, వీరిని అలాగే ఉంచుకోవాలని భావిస్తుండొచ్చు. వీరికి విధ్వంసక బృందం ఉంది. ఎడమచేతి వాటం కలిగిన ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్స్ ఇద్దరూ వచ్చి సిక్సర్లతో విరుచుకపడుతుంటారు. ఆపై హెన్రిచ్ క్లాసెన్ వచ్చి విద్వంసం చేస్తుంటాడు అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

మార్క్రం, భువనేశ్వర్‌ల పరిస్థితి?

ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ, అతను మార్క్రామ్ SRH కోసం పోటీదారుగా ఉంటాడు. కానీ, అతన్ని కొనసాగించలేకపోవచ్చు. అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ విషయంలోనూ అదే జరగొచ్చు. ఈసారి వేలం, రిటైన్ లిస్ట్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

IPL 2024లో సన్‌రైజర్స్ జట్టు..

పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మర్క్రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్, గ్లెన్ ఫిలిప్స్, , వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, మయాంక్ అగర్వాల్, అన్మోల్ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, ఝత్వేద్ సుబ్రమణియన్, విజయకాంత్ వ్యాస్కాంత్, ఫజల్హాక్ ఫారూఖీ, మార్కో జాన్సెన్, ఆకాష్ మహరాజ్ సింగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..