IPL 2024: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో భారీ జంప్..

IPL 2024 Points Table: పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2024లో ఆడిన రెండు మ్యాచ్‌లలో ఒక ఓటమి, ఒక విజయంతో 2 పాయింట్లు సాధించి మూడో స్థానానికి చేరుకుంది. హైదరాబాద్ నెట్ రన్ రేట్ +0.675లుగా నిలిచింది. ముంబై ఇండియన్స్‌పై గెలిచి చరిత్ర సృష్టించింది.

IPL 2024: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో భారీ జంప్..
Srh
Follow us

|

Updated on: Mar 28, 2024 | 10:11 AM

Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) టోర్నమెంట్ ప్రారంభమై ఒక వారం పూర్తయింది. ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు జరిగాయి. బుధవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో హైదరాబాద్ 277 పరుగుల రికార్డు స్కోరు చేయగా, లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై 246 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్‌లో ఈరోజు జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. IPL 2024 పాయింట్ల పట్టిక ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో, చెన్నై జట్టు రెండింటినీ గెలిచింది. నాలుగు పాయింట్లు సాధించింది. ప్రస్తుతం చెన్నై రన్ రేట్ +1.979లుగా నిలిచింది.

సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఆడిన ఒక మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచింది. దీంతో ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. అయితే, రన్ రేట్ +1.000 కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక ఓటమి, ఒక విజయం సాధించి 2 పాయింట్లు సాధించి మూడో స్థానానికి చేరుకుంది. హైదరాబాద్ నికర రన్ రేట్ +0.675గా నిలిచింది.

శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు కూడా ఒక మ్యాచ్ గెలిచి 2 పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. కేకేఆర్ నెట్ రన్ రేట్ +0.200లుగా నిలిచింది.

శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 1 విజయం, 1 ఓటమితో 2 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. పంజాబ్ నెట్ రన్ రేట్ +0.025లుగా నిలిచింది.

ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐదో స్థానానికి ఎగబాకింది. ఆడిన 2 మ్యాచ్‌ల్లో 1 ఓటమి, 1 విజయంతో 2 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉంది. బెంగళూరు నెట్ రన్ రేట్ -0.180లుగా నిలిచింది.

శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలోని గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడి 2 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. గుజరాత్ నెట్ రన్ రేట్ -1.425లుగా నిలిచింది.

రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఒక మ్యాచ్‌లో ఓడి పాయింట్లు సాధించకుండా ఎనిమిదో స్థానంలో ఉంది. ఢిల్లీ నెట్ రన్ రేట్ -0.455లుగా నిలిచింది.

హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్లు సాధించకుండా తొమ్మిదో స్థానంలో ఉంది. ముంబై నెట్ రన్ రేట్ -0.925లుగా నిలిచింది.

కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఒక మ్యాచ్‌లో ఓడి ఖాతా తెరవకుండానే పదో స్థానంలో ఉంది. లక్నో నెట్ రన్ రేట్ -1.000లుగా నిలిచింది.

ఆరెంజ్ క్యాప్ జాబితాలో హైదరాబాద్‌కు చెందిన హెన్రిచ్ క్లాసెన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 143 పరుగులు చేశాడు. ఆర్సీబీ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో మొత్తం 98 పరుగులు చేశాడు. హైదరాబాద్ జట్టులోని మరో బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ రెండు మ్యాచ్‌లు ఆడిన 95 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

పర్పుల్ క్యాప్ జాబితాలో సీఎస్‌కే ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ మొత్తం 6 వికెట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అతని వెనుక పంజాబ్ కింగ్స్ ఆటగాడు హర్‌ప్రీత్ బ్రార్ ఉన్నాడు. బ్రార్ ఆడిన రెండు మ్యాచ్‌లలో 3 వికెట్లు తీసుకున్నాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీ 20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టేది అతనే: యువరాజ్
టీ 20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టేది అతనే: యువరాజ్
రెండు మిలియన్ వాహనాలను రీకాల్ చేసిన టెస్లా
రెండు మిలియన్ వాహనాలను రీకాల్ చేసిన టెస్లా
ఈ ఉద్యోగంలో మీకు మీరే బాస్.. ఖాళీ సమయంలో చేసుకోవచ్చు..
ఈ ఉద్యోగంలో మీకు మీరే బాస్.. ఖాళీ సమయంలో చేసుకోవచ్చు..
తలలో పేలు ఎక్కువగా ఉన్నాయా.. వీటితో చెక్ పెట్టండి!
తలలో పేలు ఎక్కువగా ఉన్నాయా.. వీటితో చెక్ పెట్టండి!
రోజూ ఉదయాన్నే చపాతీ నెయ్యి తింటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి..
రోజూ ఉదయాన్నే చపాతీ నెయ్యి తింటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి..
సెగలు కక్కుతున్న సూర్యుడు.. మరికొద్ది రోజులు ఇంతే ఎండలు..
సెగలు కక్కుతున్న సూర్యుడు.. మరికొద్ది రోజులు ఇంతే ఎండలు..
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు.. ఆరు నెలల్లో 2604 కోట్లు హాంఫట్..!
పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు.. ఆరు నెలల్లో 2604 కోట్లు హాంఫట్..!
మే 1న వృద్ధాప్య పెన్షన్ పంపిణీపై చర్యలు తీసుకోవాలి.. కూటమి నేతలు
మే 1న వృద్ధాప్య పెన్షన్ పంపిణీపై చర్యలు తీసుకోవాలి.. కూటమి నేతలు
కూరగాయలు, పండ్ల మీద ఉండే కెమికల్స్‌ని ఇలా తొలగించండి..
కూరగాయలు, పండ్ల మీద ఉండే కెమికల్స్‌ని ఇలా తొలగించండి..
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..
అచ్చుగుద్దినట్టు తండ్రిని దించేస్తున్న అబ్బాస్ కొడుకు..