IPL2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ల డేట్స్ ఇవే! ఉప్పల్‌తో పాటు వైజాగ్‌లోనూ మ్యాచ్‌లు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. మార్చి 22 నుంచి మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరగనుంది. అయితే మరి ఈ షెడ్యూల్‌లో మన హోం సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లు ఎప్పుడు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? అనే పూర్తి వివరాలు మీ కోసం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. IPL 2025 మొదటి మ్యాచ్ మార్చ్ 22న కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మార్చి 25న జరుగుతుంది. మొత్తం 13 నగరాల్లో 10 జట్ల మధ్య 74 మ్యాచ్‌లు జరుగుతాయి. వీటిలో ప్లేఆఫ్ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. లీగ్ మ్యాచ్‌లు మార్చి 22 నుండి మే 18 వరకు జరుగుతాయి. మరి అందులో మన హోం టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ల డేట్స్ ఏంటి? ఉప్పల్‌లో ఎప్పుడెప్పుడు మ్యాచ్‌లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..