
IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌కు తమ కెప్టెన్‌ను అధికారికంగా ప్రకటించింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ వరుసగా మూడో సీజన్‌కు (2024, 2025, 2026) SRH కెప్టెన్‌గా కొనసాగనున్నట్లు ఫ్రాంచైజీ నిర్ధారించింది. ఈ ప్రకటనతో, భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) వంటి ఆటగాళ్లు కెప్టెన్సీ మార్పులపై చేసిన ఊహాగానాలకు తెరపడినట్లైంది.
పాట్ కమిన్స్ IPL 2024 మెగా వేలంలో రూ. 20.50 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి వచ్చి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. తన మొదటి సీజన్‌లోనే (2024) జట్టును ఫైనల్ వరకు నడిపించాడు. అతని నాయకత్వ అనుభవంపై ఫ్రాంచైజీ పూర్తి విశ్వాసం ఉంచుతూ, 2026 సీజన్‌కు కూడా కొనసాగించాలని నిర్ణయించుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ అధికారిక ‘X’ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది. పాట్ కమిన్స్ ఫొటోను పంచుకుంటూ, అతని నాయకత్వ పాత్రను పునరుద్ఘాటించింది.
ఐపీఎల్ 2026 మినీ-వేలానికి ముందు, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో కొన్ని కీలక మార్పులు చేసింది. స్టార్ పేసర్ మొహమ్మద్ షమీని లక్నో సూపర్ జెయింట్స్ (LSG)కి ట్రేడ్ చేసింది. అలాగే ఆడమ్ జంపా, రాహుల్ చాహర్ వంటి స్పిన్నర్లను విడుదల చేసింది. అయితే, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వంటి కీలక ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది.
P.S. 𝘞𝘦 𝘢𝘭𝘭 𝘨𝘰𝘯𝘯𝘢 𝘭𝘰𝘷𝘦 𝘵𝘩𝘪𝘴 😉🧡
Pat Cummins | #PlayWithFire pic.twitter.com/r4gtlypAY9
— SunRisers Hyderabad (@SunRisers) November 17, 2025
2026 లో ట్రావిస్ హెడ్ SRH కెప్టెన్సీ పొందే అవకాశం గురించి భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడిన కొన్ని గంటల తర్వాత ఈ పోస్ట్ రావడం గమనార్హం. ఈ సీజన్‌లో జట్టు రిటెన్షన్‌లు, రిలీజుల తర్వాత కమిన్స్ గాయం కొనసాగితే, ఆరెంజ్ ఆర్మీ మరో ఆస్ట్రేలియన్ జట్టు వైపు చూడవచ్చని ఆయన అన్నారు.
“క్లాసెన్‌ను విడుదల చేయాలనే ఆలోచన వెనుక పెద్దగా అర్థం లేదు. ఎందుకంటే మీరు అతన్ని ఎందుకు వదిలివేస్తారు?” అంటూ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పుకొచ్చాడు. “SRH బౌలింగ్ ఆందోళనకరంగా ఉంది. షమీని విడుదల చేసే ముందు నేను ఒకటి లేదా రెండుసార్లు ఆలోచించేవాడిని. బహుశా భరత్ అరుణ్ సంజీవ్ గోయెంకాతో షమీని తీసుకోవాలని చెప్పి ఉండవచ్చు, నేను అతని నుంచి ఉత్తమంగా తీసుకుంటాను. కమిన్స్ గాయం ఆందోళన కలిగిస్తుంది. దీంతో కెప్టెన్‌గా ట్రావిస్ హెడ్ వైపు చూడవచ్చు” అంటూ చెప్పుకొచ్చాడు.
కమ్మిన్స్ చాలా కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. దీని కారణంగా పెర్త్‌లో జరిగే తొలి యాషెస్ టెస్ట్‌కు అతను అధికారికంగా దూరమయ్యాడు. అయితే, బ్రిస్బేన్‌లో జరిగే రెండో టెస్ట్‌కు అతను సకాలంలో కోలుకుంటాడని ఆస్ట్రేలియా ఆశిస్తోంది. అతను ఇప్పటికే దాని కోసం శిక్షణ ప్రారంభించాడు. కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో, నవంబర్ 21 నుంచి ఇంగ్లాండ్‌తో జరిగే తొలి టెస్ట్‌లో స్టీవెన్ స్మిత్ ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించనున్నాడు. డిసెంబర్ 4 నుంచి రెండో మ్యాచ్ బ్రిస్బేన్‌లో జరగనుంది.
IPL 2024 కి ముందు ఐడెన్ మార్క్రామ్ నుంచి SRH బాధ్యతలు స్వీకరించిన కమిన్స్, ఆస్ట్రేలియాను ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌కు, 2023 వన్డే ప్రపంచ కప్ విజయానికి నడిపించిన కొద్దికాలానికే వేలంలో రూ. 20.50 కోట్లకు సంతకం చేసింది. అతని ఆధ్వర్యంలో హైదరాబాద్ జట్టు 2024 లో రన్నరప్‌గా నిలిచింది. కానీ, 2025లో ప్లేఆఫ్స్‌కు దూరంగా ఉంది.
IPL 2026 కి ముందు, SRH అభినవ్ మనోహర్, అథర్వ తైడే, సచిన్ బేబీ, వియాన్ ముల్డర్, సిమర్జీత్ సింగ్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపాలను విడుదల చేసింది. అదే సమయంలో షమీని లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ చేసింది.
SRH IPL 2026 జట్టు: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, రవిచంద్రన్ స్మరన్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్సే, పాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్స్, జిషాన్ మలింగ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..