IPL 2026: ఇక నువ్వు మారవా.. బ్యాగ్ సర్దుకుని ఇంటికిపో.. కావ్యపాప పరువు తీస్తున్నావ్‌గా

Sunil Gavaskar on Abhishek Sharma: ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. టీ20 వరల్డ్ కప్‌లో పేలవ ప్రదర్శన తర్వాత, ఐపీఎల్‌లోనైనా పుంజుకుంటాడని ఆశించిన అభిమానులకు షాక్ ఇచ్చాడు. అభిషేక్ ఆటతీరుపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

IPL 2026: ఇక నువ్వు మారవా.. బ్యాగ్ సర్దుకుని ఇంటికిపో.. కావ్యపాప పరువు తీస్తున్నావ్‌గా
Sunil Gavaskar On Abhishek Sharma

Updated on: Mar 29, 2026 | 6:29 PM

Sunil Gavaskar on Abhishek Sharma: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్‌సీబీతో జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ఘోరంగా విఫలమయ్యారు. టాస్ గెలిచిన ఆర్‌సీబీ మొదట బౌలింగ్ ఎంచుకోగా, ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. ముఖ్యంగా గత సీజన్ హీరో అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో మెరుపులు మెరిపిస్తాడని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది.

వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత అదే తీరు..

అభిషేక్ శర్మకు ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026 ఒక పీడకలలా మిగిలిపోయింది. ఆడిన ఆరు మ్యాచుల్లో ఏకంగా మూడు సార్లు డకౌట్ అయి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. మెగా టోర్నీ ఒత్తిడి వల్ల అలా ఆడాడేమో అని సర్దిచెప్పుకున్నా, ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో కూడా అదే తరహా అడ్డగోలు షాట్లు ఆడి వికెట్ సమర్పించుకున్నాడు. జేకబ్ డఫీ వేసిన మూడవ ఓవర్లో అనవసరపు షాట్‌కు ప్రయత్నించి అవుట్ అవ్వడం అతని బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తోంది.

గవాస్కర్ ఘాటు విమర్శలు..

అభిషేక్ శర్మ ఆటతీరుపై లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మారవా?” అంటూ అభిషేక్ షాట్ సెలెక్షన్‌ను తప్పుబట్టారు. బౌలర్లు ప్రతిసారీ ఒకేలా బౌలింగ్ చేయరని, పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని హితవు పలికారు. పదే పదే ఒకే రకమైన తప్పులు చేస్తూ వికెట్ పారేసుకోవడం వల్ల నీ కెరీర్‌కే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు.

ప్రమాదంలో అభిషేక్ కెరీర్?

ఏ ఐపీఎల్ ప్రదర్శనతో అయితే అభిషేక్ శర్మ టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడో, ఇప్పుడు అదే ఐపీఎల్‌లో విఫలమైతే జట్టులో తన స్థానం గాలిలో దీపంలా మారే అవకాశం ఉంది. ఇప్పటికే అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి మ్యాచుల్లోనైనా తన తప్పులు సరిదిద్దుకుని పాత అభిషేక్ శర్మను చూపిస్తాడో లేదో వేచి చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us