Greatest Test Captain of The 21st Century: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా.. అంతర్జాతీయ క్రికెట్‌లో 21 వ శతాబ్దపు బెస్ట్ టెస్ట్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో ప్రకటించింది. రికీ పాంటింగ్, గ్రేమ్ స్మిత్, విరాట్ కోహ్లీలతో పోటీ పడి విజేతగా నిలిచినట్లు స్టార్‌స్పోర్ట్స్ ప్యానల్ పేర్కొంది. ఈ ఎంపికపై పోల్ నిర్వహించిన స్టార్ స్పోర్ట్స్.. నిన్న తుది ఫలితాన్ని విడుదల చేసింది. కాగా, తుది నిర్ణయం మాత్రం భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీసుకున్నట్లు స్టార్‌స్పోర్ట్స్ వెల్లడించింది.
స్టీవ్ వా, గ్రేమ్ స్మిత్, రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. అగ్రస్థానంలో స్టీవ్ వా నిలవగా, స్మిత్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. వా హయాంలో ఆస్ట్రేలియన్లు ప్రపంచ క్రికెట్‌లో అజేయంగా నిలిచారు. ఏకధాటిగా 16 టెస్టుల్లో గెలిచి ప్రపంచ క్రికెట్‌ను శాసించారు. కానీ, 2001 లో సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్‌తో వారి ప్రాభవం పడిపోయింది. స్టార్‌స్పోర్ట్స్ ప్యానల్‌లో సంజయ్ బంగర్, వీవీఎస్ లక్ష్మణ్, నాజర్ హుస్సేన్ లాంటి ప్రముఖ మాజీలు ఉన్నారు. వీరిలో హుస్సేన్, లక్ష్మణ్‌లు స్మిత్‌ను ఎంచుకోగా, బంగార్ మాత్రం స్టీవ్ వా కు ఓటు వేశాడు.
ఈ సందర్భంగా వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ, స్మిత్ దక్షిణాఫ్రికా జట్టును కింది స్థాయి నుంచి నిర్మించేందుకు కీలక పాత్ర పోషించాడు. స్టీవ్ వాకు మాత్రం షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్ లాంటి గొప్ప ప్లేయర్ల అండ లభించిందని పేర్కొన్నాడు. ‘‘ నా ఓటు కచ్చితంగా స్మిత్ కే. ఎందుకంటే ఆయన జట్టును తయారుచేసిన విధానం చాలా ప్రత్యేకమైంది. స్టీవ్ వా, పాంటింగ్ లకు మాత్రం షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్, జాసన్ గిల్లెస్పీ వంటి ఆటగాళ్లు అండగా నిలిచారు. మరోవైపు స్మిత్ చిన్న వయస్సులో జట్టుకు నాయకుడిగా మారాడని” లక్ష్మణ్ వెల్లడించాడు. హాన్సీ క్రోన్జే నాయకత్వంలో చెలరేగిన వివాదాల నుంచి జట్టును ముందుకు సాగించి, గొప్పగా పునర్నిర్మించాడని స్మిత్‌ను హుస్సేన్ ప్రశంసించాడు.
అయితే, భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేరును మాత్రం ఈ ఎలైట్ కెప్టెన్ల జాబితాలో చేర్చక పోవడం గమనార్హం. మొహమ్మద్ అజారుద్దీన్ సారథ్యంలో భారత టీం మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుంది. ఈ కారణంగా జట్టు గందరగోళానికి గురైంది. ఈ వివాదాల అనంతరం టీమిండియాను పునర్నిర్మించిన ఘనత గంగూలీకే చెందుతుంది. అనంతరం జరిగిన 2003 ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకోవడంలో దాదా కీలక పాత్ర పోషించాడనేది అక్షర సత్యం. గంగూలీ నాయకత్వంలో 2002 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరడంతోపాటు, 2002 నాట్వెస్ట్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది.
The leader of one of the greatest Test sides in ? history, ?? legend – Steve Waugh is ? the #GOATOfThe21stCentury Men’s Test Captain!
Did you vote for him? pic.twitter.com/onRqQ7ZTnG
— Star Sports (@StarSportsIndia) June 22, 2021
Also Read:
IND Vs NZ, WTC Final 2021 Day 6th Live: రిజర్వ్‌డేకు చేరిన ఫైనల్ మ్యాచ్.. పెవిలియన్‌కు పుజారా
Shaminda Eranga : టెస్ట్, వన్డే, టీ 20 ఫార్మాట్లలో మొదటి ఓవర్‌లోనే వికెట్ సాధించిన ఏకైక బౌలర్..!
International Olympic Day 2021: ఈ ఏడాది నిర్వహించే అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవ థీమ్ ఏంటో తెలుసా..?