Australia: జింబాబ్వే చేతిలో ఘోర పరాజయం.. కట్‌చేస్తే.. బరిలోకి 74 సెంచరీల ప్లేయర్‌.. ఎవరంటే?

Steve Smith Included in Australia T20I World Cup: టీ20 ప్రపంచకప్‌లో నిరాశపరిచే ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్‌ టీ20 ప్రపంచకప్‌ నుంచి దూరమయ్యాడు. అతని స్థానంలో సీనియర్ ప్లేయర్ ను జట్టులోకి తీసుకున్నారు.

Australia: జింబాబ్వే చేతిలో ఘోర పరాజయం.. కట్‌చేస్తే.. బరిలోకి 74 సెంచరీల ప్లేయర్‌.. ఎవరంటే?
Australia T20i Squad

Updated on: Feb 16, 2026 | 2:00 PM

Australia vs Sri Lanka: చివరకు భయపడినదే జరిగింది. ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ 2026 టీ20 ప్రపంచ కప్ నుంచి తప్పుకున్నాడు. ఐర్లాండ్ తో మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ సమయంలో మార్ష్ గాయపడ్డాడు. దీని వల్ల అతను మొదటి రెండు మ్యాచ్ లు ఆడలేకపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతను టోర్నమెంట్ కు పూర్తిగా దూరమయ్యాడు. ఆస్ట్రేలియా జట్టులో మిచెల్ మార్ష్ స్థానంలో స్టీవ్ స్మిత్ చేరాడన్నది కీలక వార్త. శ్రీలంకతో జరిగే కీలక మ్యాచ్ లో అతను ఆడనున్నాడు.

అద్భుతమైన ఫామ్‌లో స్టీవ్ స్మిత్..

స్టీవ్ స్మిత్‌ను ఒక ప్రధాన టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా పరిగణిస్తారు. కానీ, అతను గొప్ప టీ20 బ్యాట్స్‌మన్ కూడా. టీ20 క్రికెట్‌లో అతని ఫామ్ కూడా ఆకట్టుకుంటుంది. సిడ్నీ సిక్సర్స్ తరపున బిగ్ బాష్ లీగ్‌లో స్మిత్ అసాధారణంగా రాణించాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 59.8 సగటుతో 299 పరుగులు చేశాడు. ముఖ్యంగా, అతని స్ట్రైక్ రేట్ 167.97గా ఉంది. ఇది అతని కెరీర్ స్ట్రైక్ రేట్ కంటే చాలా ఎక్కువ. స్మిత్ ఆరు బిగ్ బాష్ మ్యాచ్‌లలో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ కూడా చేశాడు.

టీ20ల్లో కెరీర్..

స్టీవ్ స్మిత్ 272 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతను 32.68 సగటుతో 6242 పరుగులు చేశాడు. స్మిత్ టీ20 క్రికెట్‌లో ఐదు సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు చేశాడు. ప్రొఫెషనల్ క్రికెట్‌లో అతనికి 74 సెంచరీలు ఉన్నాయి.

మిచెల్ మార్ష్ మిస్..

ఆస్ట్రేలియా జట్టు మిచెల్ మార్ష్‌ను కోల్పోతుంది. ఓపెనర్‌గా ఆస్ట్రేలియా తరపున అనేక మ్యాచ్‌లను గెలిపించాడు. మార్ష్ అంతర్జాతీయ టీ20లలో 32.33 సగటుతో 2102 పరుగులు, 140కి దగ్గరగా స్ట్రైక్ రేట్ సాధించాడు. మార్ష్ ఒక సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు సాధించాడు. మార్ష్, హెడ్ భాగస్వామ్యం ప్రత్యర్థి జట్లకు పీడకలగా మారుతోంది. కానీ ఇప్పుడు ఈ భాగస్వామ్యం విచ్ఛిన్నమైంది. జింబాబ్వేతో జరిగిన మునుపటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఇప్పుడు శ్రీలంకపై ఎలాగైనా గెలవాల్సి ఉంది. ఒకవేళ ఓడిపోతే జింబాబ్వే సూపర్ 8కి అర్హత సాధించవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..