IND vs SL: శిఖర్ ధావన్ సారథ్యంలో శ్రీలంక బయలుదేరిన టీమిండియా

|

Jun 28, 2021 | 4:27 PM

పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడేందుకు టీమిండియా సోమవారం శ్రీలంక బయల్దేరింది. శిఖర్‌ ధావన్‌ సారథ్యంలోని 20 మంది సభ్యులు, ఐదుగురు నెట్‌ బౌలర్లతో కూడిన జట్టు విమానంలో శ్రీలంకకు పయనమైంది.

IND vs SL: శిఖర్ ధావన్ సారథ్యంలో శ్రీలంక బయలుదేరిన టీమిండియా
Team India Sri Lanka Tour
Follow us on

IND vs SL: పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడేందుకు టీమిండియా సోమవారం శ్రీలంక బయల్దేరింది. శిఖర్‌ ధావన్‌ సారథ్యంలోని 20 మంది సభ్యులు, ఐదుగురు నెట్‌ బౌలర్లతో కూడిన జట్టు విమానంలో శ్రీలంకకు పయనమైంది. ఈమేరకు ట్విటర్‌ లో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. అందరు కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. అక్కడికి చేరుకున్నాక జూలై 1 వరకు కొలంబోలో క్వారంటైన్‌లోనే ఉండనున్నారు. అనంతరం నెట్ ప్రాక్టీస్ ను ప్రారంభించనున్నారు. జూలై 13 నుంచి 3 వన్డేల సిరీస్ మొదలు కానుంది. అనంతరం 3 టీ20లు కూడా ఆడనున్నారు. కెప్టెన్‌గా ధావన్‌ టీంను నడిపించనుండగా, రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నారు. మ్యాచ్‌లన్నీ కొలంబోలోని ఆర్‌.ప్రేమదాస స్టేడియంలో జరుగనున్నాయి.

కాగా, జులై13న మొదటి వన్డేతో శ్రీలంక పర్యటన మొదలు కానుంది. రెండో వన్డే జులై 16న, మూడో వన్డే జులై 18న జరగనుంది. వన్డే సిరీస్‌ తరువాత జులై 21న తొలి టీ20 భారత్, శ్రీలంక టీం లు తలపడనున్నాయి. అలాగే రెండో టీ20 జులై 23న, జులై 25న చివరి టీ20 తో శ్రీలంక పర్యటన ముగియనుంది. అన్ని మ్యచ్‌లు కొలోంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే నిర్వహించనున్నారు. వన్డేలు మధ్యాహ్నం గం. 2.30లకు మొదలుకానుండగా, టీ20లు రాత్రి గం.7లకు ప్రారంభమవుతాయి.

భారత జట్టు: శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, భువనేశ్వర్‌ కుమార్‌(వైస్‌ కెప్టెన్‌), దేవదత్‌ పడిక్కల్‌, రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), యజువేంద్ర చాహల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్యా, నితీశ్‌ రాణా, రాహుల్‌ చహర్‌, కే గౌతం, కృనాల్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, దీపక్‌ చహర్‌, నవదీప్‌ సైనీ, చేతన్‌ సకారియా.

నెట్ బౌలర్స్ గా ఇషాన్‌ పోరేల్‌, సందీప్‌ వారియర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, సాయి కిషోర్‌, సిమర్‌జీత్‌ సింగ్‌ టీమిండియా తోడుగా వెళ్లారు.

Also Read:

IND vs SL: “ఇక్కడ రాణిస్తే.. పొట్టి ప్రపంచ కప్‌లో ఆడే ఛాన్స్ రావొచ్చు”; యంగ్ ప్లేయర్లతో టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్

Team India: డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి.. ‘నయా వాల్’కు ఉద్వాసన.. తుది జట్టులోకి టీ20 స్పెషలిస్ట్.!