
Pakistan vs Sri Lanka, 8th Match: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో పాకిస్థాన్, శ్రీలంక జట్లు ముఖాముఖిగా తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు శుభారంభం లభించకపోయినా.. ఆ తర్వాత కుశాల్ మెండిస్ అద్భుత ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. అలాగే సధీర కూడా సెంచరీతో చెలరేగడంతో పాకిస్తాన్‌కు భారీ టార్గెట్ అందించారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లకు శ్రీలంక జట్టు 9 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది. దీంతో బాబర్ సేన ముందు భారీ టార్గెట్ నిలిచింది.
కుశాల్ మెండిస్ కేవలం 65 బంతుల్లోనే సెంచరీ మార్కును చేరుకున్నాడు. తద్వారా ప్రపంచకప్‌లో శ్రీలంక తరపున అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్‌గా కుశాల్ మెండిస్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు కుమార సంగక్కర పేరిట ఉండేది. కుమార సంగక్కర 70 బంతుల్లో సెంచరీ సాధించాడు. 2015 ప్రపంచకప్‌లో అతను ఈ సెంచరీని సాధించాడు. కానీ, ఇప్పుడు కుశాల్ మెండిస్ తన పేరు మీద రికార్డు సృష్టించాడు.
కుశాల్ మెండిస్ 77 బంతుల్లో 158.44 స్ట్రైక్ రేట్‌తో 122 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. కాగా, సదీర సమరవిక్రమ 89 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశాడు. పాకిస్థాన్ తరపున హసన్ అలీ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు.
ఓ సమయంలో శ్రీలంక జట్టు స్కోరును 380 దాటి సులువుగా తీసుకెళ్తుందని అనిపించినా.. చివరి ఓవర్లలో పాక్ బౌలర్లు ధీటుగా పుంజుకుని శ్రీలంకను 350 పరుగులలోపే కట్టడి చేశారు. చివరి 10 ఓవర్లలో పాక్ బౌలర్లు 61 పరుగులిచ్చి 5 వికెట్లు తీశారు.
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక (కెప్టెన్), దునిత్ వెల్లాలఘే, మహిష్ తీక్షణ్, మతీష్ పతిరణ, దిల్షన్ మధుశంక.
పాకిస్థాన్ (ప్లేయింగ్ ఎలెవన్): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..