IND vs SL, 1st T20I Playing 11: టాస్ గెలిచిన లంక.. అరంగేట్రం చేసిన ఇద్దరు యువ ఆటగాళ్లు.. భారత ప్లేయింగ్ 11 ఇదే..

|

Jan 03, 2023 | 6:39 PM

India vs Sri Lanka 1st T20I: కొత్త ఏడాది తొలి మ్యాచ్‌లో టీమిండియా నేడు శ్రీలంకతో తలపడేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది.

IND vs SL, 1st T20I Playing 11: టాస్ గెలిచిన లంక.. అరంగేట్రం చేసిన ఇద్దరు యువ ఆటగాళ్లు.. భారత ప్లేయింగ్ 11 ఇదే..
Follow us on

India vs Sri Lanka 1st T20I: కొత్త ఏడాది తొలి మ్యాచ్‌లో టీమిండియా నేడు శ్రీలంకతో తలపడేందుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లు లేకుండానే బరిలోకి దిగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఓపెనింగ్ జోడీతో శ్రీలంకపై టీమిండియా బరిలోకి దిగనుంది.

కాగా, ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అదే సమయంలో శివమ్ మావి, శుభమాన్ గిల్‌లకు భారత జట్టు నుంచి అరంగేట్రం చేసే అవకాశం లభించింది. అర్ష్‌దీప్ నేడు ఆడడం లేదు.

ఇవి కూడా చదవండి

కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందు ఈ ఏడాది తొలి మ్యాచ్‌లో గెలవడం టీమిండియాకు సవాలుగా మారనుంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో కొత్త ఏడాది తొలి మ్యాచ్‌లో టీమిండియా ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. పాండ్యా తొలిసారిగా స్వదేశంలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఈ మ్యాచ్‌లో విజయంతో సంవత్సరాన్ని ప్రారంభించాలని భారత యువ దళం కోరుకుంటోంది. అదే సమయంలో, ఆసియా ఛాంపియన్ శ్రీలంక కొత్త ముఖాలతో భారత్‌ను ఓడించాలని కోరుకుంటోంది.

భారత్ ప్లేయింగ్ XI: ఇషాన్ కిషన్(కీపర్), శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, యుజ్వేంద్ర చాహల్

శ్రీలంక ప్లేయింగ్ XI: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక(కెప్టెన్), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..