Asia Cup 2023: పాకిస్తాన్‌కు షాకిచ్చిన మరో రెండు దేశాలు.. భారత నిర్ణయానికి అనుకూలమంటూ ప్రకటన..

Sri Lanka, Bangladesh: 2023 ఆసియా కప్‌ను పాకిస్థాన్‌లో నిర్వహించడానికి పీసీబీ (Pakistan Cricket Board) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఈ ప్రయత్నంలో పాకిస్థాన్‌కు పొరుగు దేశాల క్రికెట్ బోర్డులు మద్దతు పలకడం లేదు.

Asia Cup 2023: పాకిస్తాన్‌కు షాకిచ్చిన మరో రెండు దేశాలు.. భారత నిర్ణయానికి అనుకూలమంటూ ప్రకటన..
Asia Cup 2023 Ind Vs Pak

Updated on: May 08, 2023 | 5:05 PM

పాకిస్థాన్‌లో ఆసియాకప్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. ఆసియా కప్ (Asia Cup 2023) పాకిస్తాన్‌లో జరిగితే, భారత జట్టు ఆడటానికి వెళ్ళదనే విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గతంలోనే బీసీసీఐ స్పష్టం చేసింది. భారత క్రికెట్ బోర్డు ఈ నిర్ణయంతో పాకిస్థాన్ కష్టాల్లో పడింది. తటస్థ వేదికలో ఆసియా కప్‌ను నిర్వహించాలని భారత బోర్డు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు పాకిస్థాన్ అంగీకరించింది. 2023 ఆసియా కప్‌ను పాకిస్థాన్‌లో నిర్వహించేందుకు పీసీబీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఈ ‘పోరాటం’లో పాకిస్థాన్‌కు పొరుగు దేశాల క్రికెట్ బోర్డులు మద్దతు పలకడం లేదు. పాకిస్థాన్ జియో స్పోర్ట్స్ నివేదిక ప్రకారం, ఆసియా కప్ విషయంలో బంగ్లాదేశ్, శ్రీలంకల మద్దతు పాకిస్థాన్‌కు లభించడం లేదు. రెండు పొరుగు దేశాల క్రికెట్ బోర్డుల మద్దతు BCCI వైపే ఉంది.

ఆసియా కప్‌కు ఆతిథ్యమివ్వడంపై భారత్, పాకిస్థాన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్‌ను బీసీసీఐకి ప్రతిపాదించింది. అయితే దీనికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆమోదం లభించలేదు. హైబ్రిడ్ మోడల్ ప్రకారం ఆసియా కప్ పాకిస్థాన్‌లో జరగనుంది. యూఏఈలో భారత్‌కు సంబంధించిన మ్యాచ్‌లు మాత్రమే జరుగుతాయి. కానీ, దీనికి బీసీసీఐ ఒప్పుకోవడం లేదు. ఆసియా కప్ మొత్తాన్ని తటస్థ వేదికగా నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది.

పాకిస్థాన్‌లో ఆసియా కప్‌నకు ఆతిథ్యం ఇవ్వకుంటే టోర్నీలో పాకిస్థాన్ పాల్గొనబోదని ఒత్తిడికి గురై పాకిస్థాన్ బోర్డు ఛైర్మన్ నజం శెట్టి సూచనప్రాయంగా వెల్లడించారు. గతంలో భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ బెదిరించింది. ఆసియా కప్‌ను సొంతంగా తరలించేందుకు పీసీబీ అంగీకరించకపోతే, టోర్నీ నిర్వహణ బాధ్యతను కూడా ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..