SRH Vs RR: ‘బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు కప్పు కాదు చిప్ప వస్తది..’

సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఐపీఎల్ రికార్డులు, బ్యాటింగ్, బౌలింగ్ గణాంకాలను ఇక్కడ తెలుసుకోండి. ఇప్పటివరకు జరిగిన 22 మ్యాచుల్లో హైదరాబాద్ 12 విజయాలతో ముందంజలో ఉండగా.. సంజూ శాంసన్, భువనేశ్వర్ కుమార్ అత్యుత్తమ ప్రదర్శనలు కనబరిచారు. ఆ వివరాలు ఇలా..

SRH Vs RR: బ్యాటింగ్‌లో రికార్డులు కొల్లగొడితే ఏం లాభం.! తొక్కలో బౌలింగ్‌కు కప్పు కాదు చిప్ప వస్తది..
Srh Vs Rr

Updated on: Apr 13, 2026 | 8:02 AM

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య పోరు రసవత్తరంగా మారనుంది. గత గణాంకాలను పరిశీలిస్తే, హైదరాబాద్ జట్టు స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తోంది. పవర్‌ఫుల్ బ్యాటర్లు, పదునైన బౌలర్లతో కూడిన ఈ రెండు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ రికార్డులు బద్దలవ్వనున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు మొత్తం 22 సార్లు తలపడ్డాయి. ఇందులో హైదరాబాద్ 12 సార్లు విజయం సాధించగా, రాజస్థాన్ 10 సార్లు విజేతగా నిలిచింది. ముఖ్యంగా హైదరాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచుల్లో రాయల్స్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది సన్‌రైజర్స్ జట్టు. గత ఐదు మ్యాచుల్లో హైదరాబాద్ నాలుగు సార్లు గెలుపొందడం విశేషం.

బ్యాటింగ్ రికార్డులు..

  • ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచుల్లో బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు.
  • అత్యధిక స్కోరు: 2025 సీజన్‌లో హైదరాబాద్ రాజస్థాన్‌పై 286/6 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డును నెలకొల్పింది. దానికి బదులుగా రాజస్థాన్ రాయల్స్ 242/6 పరుగులు సాధించింది.
  • వ్యక్తిగత స్కోరు: రాజస్థాన్ తరపున జోస్ బట్లర్ 124 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉండగా.. హైదరాబాద్ తరపున ఇషాన్ కిషన్ 106 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు.
  • మొత్తం పరుగులు: సంజూ శాంసన్ ఈ పోరులో రాజస్థాన్ తరపున అత్యధికంగా 764 పరుగులు సాధించగా, హైదరాబాద్ తరపున శిఖర్ ధావన్(253 పరుగులు) ముందంజలో ఉన్నాడు.

బౌలింగ్ గణాంకాలు:

  • బౌలింగ్ విభాగంలో ఇరు జట్ల ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు.
  • అత్యధిక వికెట్లు: హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రాజస్థాన్‌పై 15 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ తరపున చాహల్ 19 వికెట్లతో కీలక బౌలర్‌గా నిలిచాడు.
  • అత్యుత్తమ ప్రదర్శన: జేమ్స్ ఫాల్కనర్(RR) 16 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం ఇప్పటికీ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలుగా ఉంది. హైదరాబాద్ తరపున భువనేశ్వర్ కుమార్(4/14) మెరుగైన ప్రదర్శన చేశాడు.

వేదిక, పిచ్ రిపోర్ట్

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ఇక్కడ జరిగిన గత 84 మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 35 సార్లు, ఛేజింగ్ చేసిన జట్లు 47 సార్లు విజయం సాధించాయి. సగటు మొదటి ఇన్నింగ్స్ స్కోరు 166 పరుగులుగా ఉంది. అయితే, ఇటీవలి కాలంలో వికెట్లు ఫ్లాట్‌గా ఉండటంతో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. కాగా, హైదరాబాద్ జట్టు బౌలింగ్‌కు.. బ్యాటర్లు ఎంత స్కోర్ కొట్టినా గెలవడం కష్టమేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఇది చదవండి:  పాక్ క్రికెటర్లకు పదేళ్లు పట్టింది.. కట్ చేస్తే.. 6 బంతుల్లోనే బుమ్రాను తగలబెట్టేశాడుగా

Follow Us