Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore Highlights in Telugu: ఐపీఎల్ 54వ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 67 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయం సాధించింది. హైదరాబాద్ తరపున రాహుల్ త్రిపాఠి అత్యధిక పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి 37 బంతుల్లో 58 పరుగులు వచ్చాయి. రాహుల్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ SRH తరపున సరిగ్గా బ్యాటింగ్ చేయలేక పెవిలియన్ చేరారు. అదే సమయంలో బెంగళూరు తరపున వనిందు హసరంగ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. హస్రంగ ఒక ఓవర్ మెయిడిన్ కావడంతోపాటు హైదరాబాద్ జట్టు వెన్ను విరిచాడు.
ఆర్‌సీబీ తరపున జోస్ హేజిల్‌వుడ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి 3 ఓవర్లలో 10 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో ఆర్‌సీబీకి 14 పాయింట్లు ఉండడంతో ప్లే ఆఫ్‌కు చేరుకోవడం మరింత సులువుగా మారింది. అదే సమయంలో, SRH ఈ ఓటమి తర్వాత, కేవలం 10 పాయింట్లను కలిగి ఉంది. ఇప్పుడు ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే రాబోయే మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి నెట్ రన్ రేట్‌ను మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది.
ఇరు జట్ల ప్లేయింగ్-XI ఎలా ఉందంటే..
సన్‌రైజర్స్ హైదరాబాద్:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మర్క్రామ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, జగదీష్ సుచిత్, కార్తీక్ త్యాగి, భువనేశ్వర్ కుమార్, ఫజల్ ఫరూకీ, ఉమ్రాన్ మాలిక్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్
ఈ సీజన్‌లో ఇరు జట్ల తలపడడం రెండో సారి. తొలి మ్యాచ్‌లో బెంగళూరుపై హైదరాబాద్ ఏకపక్ష విజయం సాధించింది.
పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్ల స్థానాలను పరిశీలిస్తే బెంగళూరు మూడో స్థానంలో ఉండగా, హైదరాబాద్ జట్టు ఆరో స్థానంలో ఉంది.
ఐపీఎల్ 54వ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 67 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయం సాధించింది. హైదరాబాద్ తరపున రాహుల్ త్రిపాఠి అత్యధిక పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి 37 బంతుల్లో 58 పరుగులు వచ్చాయి. రాహుల్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ SRH తరపున సరిగ్గా బ్యాటింగ్ చేయలేక పెవిలియన్ చేరారు. అదే సమయంలో బెంగళూరు తరపున వనిందు హసరంగ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. హస్రంగ ఒక ఓవర్ మెయిడిన్ కావడంతోపాటు హైదరాబాద్ జట్టు వెన్ను విరిచాడు.
హైదరాబాద్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. హసరంగా బౌలింగ్‌లో ఉమ్రాన్ మాలిక్ (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో విజయానికి మరో వికెట్ దూరంలో నిలిచింది బెంగళూరు.
హసరంగా నాలుగో వికెట్‌తీశాడు. అతని బౌలింగ్‌లో శశాంక్ (8) భారీ షాట్‌కు యత్నించి మ్యాక్స్‌వెల్‌కు చిక్కాడు. 16.3 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ స్కోరు 114/8.
చివరి ఆశగా ఉన్న రాహుల్ త్రిపాఠి (58) కూడా ఔటయ్యాడు. దీంతో హైదరాబాద్ మరో ఓటమికి చేరువలో నిలిచింది. ఆ జట్టు విజయం సాధించాలంటే 26 బంతుల్లో 79 పరుగులు అవసరం.
హైదరాబాద్ ఐదో వికెట్ కోల్పోయింది. హసరంగా బౌలింగ్లో ముందుకొచ్చి ఆడడానికి ప్రయత్నించిన సుచిత్ (2) స్టంపౌట్ అయ్యాడు. హసరంగాకు ఇది మూడో వికెట్. హైదరాబాద్ విజయానికి 33 బంతుల్లో 89 పరుగులు అవసరం.
రాహుల్ త్రిపాఠి (32 బంతుల్లో 54) అర్ధ సెంచరీ సాధించాడు. అతనికి తోడుగా సుచిత్ (2) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ స్కోరు 13.1 ఓవర్లకు 100/4.
హైదరాబాద్ నాలుగో వికెట్ కోల్పోయింది. నికోలస్ పూరన్ (19) హసరంగా బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరోవైపు రాహుల్ త్రిపాఠి (46) అర్థసెంచరీకి చేరువవుతున్నాడు. ఆ జట్టు విజయానికి 47 బంతుల్లో 104 పరుగులు అవసరం.
హైదరాబాద్ బ్యాటర్లు గేర్ మార్చారు. రాహుల్ త్రిపాఠి (41), నికోలస్ పూరన్ (12) ధాటిగా ఆడుతున్నారు. అయితే ఆ జట్టు సాధించాల్సిన పరుగులు భారీగా ఉండడంతో రన్‌రేట్ భారీగా పెరిగిపోతోంది. హైదరాబాద్ విజయానికి ఇంకా 54 బంతుల్లో 117 పరుగులు అవసరం.
.
నిలకడగా ఆడుతున్న త్రిపాఠి, మర్‌క్రమ్ జోడిని హసరంగా విడదీశాడు. మర్‌క్రమ్(21)ను ఔట్ చేసి ఆర్సీబీకి బ్రేక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ స్కోరు 8.2 ఓవర్లకు 51/3.
హైదరాబాద్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. రాహుల్ త్రిపాఠి (27), మర్‌క్రమ్(20) స్కోరుబోర్డును ముందుకు తీసుకెళుతున్నారు. 7.4 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 48/2. సాధించాల్సిన రన్‌రేట్ 11కు పైగానే ఉంది.
సన్‌రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ (0) మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
సన్‌రైజర్స్‌కు మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది. కెప్టెన్ విలియమ్సన్ (0) పరుగులేమీ చేయకుండానే రనౌట్‌గా వెనుదిరిగాడు.
దినేశ్ కార్తీక్ మళ్లీ అదరగొట్టాడు. ధనాధన్ ఇన్నింగ్స్ ( 8బంతుల్లో 30 పరుగులు) తో బెంగళూరుకు భారీ స్కోరు అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 సిక్స్‌లు, ఒక ఫోర్ ఉన్నాయి. ముఖ్యంగా ఫరూఖీ వేసిన చివరి ఓవర్‌లో 25 పరుగులు పిండుకున్నాడీ వెటరన్ బ్యాటర్.
ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న మ్యాక్స్ వెల్ (33)ను త్యాగి ఔట్ చేశాడు. మరోవైపు డుప్లెసిస్ (70) నిలకడగా ఆడుతున్నాడు. 18.2 ఓవర్లు ముగిసే సరికి బెంగళూర స్కోరు 159/3.
బెంగళూరు స్కోరు 150 దాటింది. డుప్లెసిస్ (69), మ్యాక్స్‌వెల్ (30) గేరు మారుస్తున్నారు. 17.3 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 154/2.
సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. దీంతో ఆర్సీబీ వేగంగా పరుగులు చేయలేకపోతోంది. డుప్లెసిస్ (65), మ్యాక్స్‌వెల్ (24) క్రీజులో ఉన్నారు. 17 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 145/2.
బెంగళూరు రెండో వికెట్ కోల్పోయింది. సుచిత్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన పటిదార్ (48) బౌండరీ లైన్ వద్ద త్రిపాఠికి చిక్కాడు. ప్రస్తుతం బెంగళూరు స్కోరు 12.2 ఓవర్లకు 105/2.
డుప్లెసిస్ అర్ధసెంచరీ (34 బంతుల్లో 51) పూర్తి చేసుకున్నాడు. మరోవైపు పటిదార్ (47) కూడా హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. వీరిద్దరూ ఇప్పటివరకు 70 బంతుల్లో 103 పరుగుల భాగస్వామ్యం అందించారు.
ఆర్సీబీ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. డుప్లెసిస్ (45), పటిదార్ (46)లు ధాటిగా ఆడుతూ అర్ధసెంచరీల వైపు సాగుతున్నారు. ప్రస్తుతం ఆర్సీబీ స్కోరు 10.4 ఓవర్లు ముగిసే సరికి 96/1.
ఆర్సీబీ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్ వేసిన 8 ఓవర్లో ఏకంగా 20 పరుగులు పిండుకున్నారు. ఈ ఓవర్లో డుప్లెసిస్ రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టగా.. పటిదార్ కూడా ఒక బౌండరీ బాదాడు..
బెంగళూరు స్కోరు 50 దాటింది. డుప్లెసిస్ (21), రజత్ పటిదార్ (32) నిలకడగా ఆడుతున్నారు. 7 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు స్కోరు 57/1.
సన్‌రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నారు. దీంతో ఆర్సీబీ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. 5 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు స్కోరు 30/1. డుప్లెసిస్ (9), రజత్ పటిదార్ (18) క్రీజులో ఉన్నారు.
విరాట్ కోహ్లీ మళ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. స్పిన్నర్ సుచిత్ వేసిన మొదటి బంతికే విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా ఈసీజన్‌లో కోహ్లీ గోల్డెన్ డకౌట్ కావడం ఇది మూడోసారి.
హైదరాబాద్ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. సీన్ అబాట్, గోపాల్‌లను తప్పించింది. ఫరూఖీ, సుచిత్‌లకు స్థానం కల్పించింది.
బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. డుప్లెసిస్ తన జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. హైదరాబాద్‌లో రెండు మార్పులు చేసింది.